ఉపాధ్యాయుడిగా మారిన ఎమ్మెల్యే.. ఏకంగా పిల్లలను ఒళ్లు కూర్చొబెట్టుకుని అక్షరాభ్యాసం

సాధారణంగా పల్లెల్లో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి బడిబాట కార్యక్రమంలో అతిథిగా ప్రజాప్రతినిధి పాల్గొన్నారు. ఆయన రాకతో చిన్నారులంతా బడిబాట పట్టారు. ఆయన ఉపాధ్యాయుడిగా మారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులు లేక మూతపడ్డ స్కూళ్లను తెరిపించారు.
సాధారణంగా పల్లెల్లో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి బడిబాట కార్యక్రమంలో అతిథిగా ప్రజాప్రతినిధి పాల్గొన్నారు. ఆయన రాకతో చిన్నారులంతా బడిబాట పట్టారు. ఆయన ఉపాధ్యాయుడిగా మారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. టీచర్ గా మారిన ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు లేక పాఠశాలలు మూత పడ్డాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా యావాపూర్, మహదేవ్‌పూర్, లక్ష్మిదేవి గూడెం, పెద్దపలుగు తండా, సోమరాజు బావి, బైరాంనగర్, పోతిరెడ్డిపల్లి, నూనెగూడెంలోని ప్రాథమిక పాఠశాలలు 60 పైగా మూతపడ్డాయి. విద్యార్థుల సంఖ్య తగ్గుతుండటంతో పాఠశాలలు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ప్రతి ఏటా బడిబాట కార్యక్రమాన్ని ఉపాద్యాయులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, పదో తరగతిలో సాధించిన ఫలితాలు, నాణ్యమైన భోజనం తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈసారి బడిబాట కార్యక్రమంలో అనుకోని అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం కలిగేలా ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. దీంతో చాలా తండాల్లో చిన్నారులు బడిబాట పట్టారు.
ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా మూత పడిన బొమ్మల రామారం మండలం యావాపూర్ తండా ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఆయన ఉపాధ్యాయడిగా మారి చిన్నారులను తన ఒడిలో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేశారు. ప్రభుత్వ బడికి వచ్చే తండాల్లోని పిల్లందరికీ అవసరమైన పలకలు, నోటు పుస్తకాలు అందిస్తానని ఐలయ్య హామీ ఇచ్చారు. కొన్నేళ్లుగా విద్యార్థులు లేక మూత బడిన పలు పాఠశాలలు మళ్ళీ తెరుచు కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.