Amaravati: అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు…మళ్లీ మిన్నంటిన ఆందోళనలు

 Amaravati: అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు…మళ్లీ మిన్నంటిన ఆందోళనలు

ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాగుతున్న ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు.

Amaravati: ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాగుతున్న ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు. మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్‌ కృష్ణంరాజు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు నినదించారు. రాజధాని అమరావతిలోని తూళ్లూరులో ప్లకార్డులు ప్రదర్శించారు.

మరోవైపు మందడం గ్రామంలో రైతులు, మహిళలు రహదారిపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై  బైఠాయించి ఆందోళనచేపట్టడంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను పక్కకు తొలగించారు. రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు, సజ్జల రామకృష్ణారెడ్డి క్షమాపణలు చెప్పే వరకూ ఈ ఆందోళనలు కొనసాగుతాయని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

గత వారం సాక్షి టీవీలో జరిగిన ఒక చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా  అమరావతి వేశ్యల రాజధాని అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చ కార్యక్రమానికి కొమ్మినేని శ్రీనివాసరావు యాంకర్‌గా వ్యవహరించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆయన ఖండించే ప్రయత్నం చేయలేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.  దీంతో అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి.

మహిళల ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక జర్నలిస్ట్ కృష్ణంరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా అరెస్ట్‌ చేయాలని మరోసారి రైతులు ఆందోళన బాట పట్టారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *