గురువారం నారాయణుడిని ఇలా పూజిస్తే చాలు.. ఇంట్లో సిరిసంపదలు..

హిందూమత ఆచారల ప్రకారం శ్రీ మహావిష్ణువు, బృహస్పతిని గురువారం రోజున ప్రజలు పూజిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలోపేతం అవడానికి ఈ రోజు (గురువారం) చాలా అనుకూలమైన రోజు అని అంటున్నరు వేద పండితులు. ముఖ్యంగా గురువు బలంగా ఉన్న వ్యక్తుల జీవితంలో అంతా శుభమే జరుగుతుందని వారు చెబుతున్నారు. జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుందని సూచిస్తున్నారు వేదపండితులు. మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గురువారం రోజున విష్ణు చాలీసా, విష్ణు సహస్త్రనామం పఠిస్తే మీ కుటుంబ సభ్యులకు శ్రీ మహా విష్ణువు ఆశీర్వాదం లభించి జీవితంలో పురోగతి సాధిస్తారు. గురువారం ఉదయం స్నానం చేసిన గంగాజలంతో పూజగదిని శుభ్రం చేసి ఆచారాల ప్రకారం విష్ణువును పూజించాలి. ఆ తర్వాత విష్ణు కథ చదవాలి. కుశ ఆసనంపై కూర్చొని మాత్రమే విష్ణు చాలీసా, విష్ణు సహస్త్రనామం చదవాలి.
శ్రీ మహావిష్ణువుకు పసుపు అంటే చాలా ఇష్టం. గురువారం విష్ణు చాలీసా, విష్ణు సహస్రనామం చదివిన తర్వాత కొన్ని పుసుపు రంగులో ఉన్న పదార్థాలను, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. అరటి పండు, బొప్పాయి వంటి పండ్లను గురువారం నాడు అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేయడం వలన జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది.
గురువారం రోజు మీకు తెలిసిన ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉంటే వారికి ఏవైనా దానం, బహుమతిగా ఇవ్వాలి. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం వలన మీ జీవితంలో అంతా శుభమే జరుగుతంది.