Rain Alert: మళ్లీ ఊపందుకున్న నైరుతి.. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో గాలి విచ్ఛిత్తిగా మరొక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి..

 Rain Alert: మళ్లీ ఊపందుకున్న నైరుతి.. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో గాలి విచ్ఛిత్తిగా మరొక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి..

వాయువ్య ఉత్తరప్రదేశ్ దాని పరిసరాల నుంచి మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌ఘడ్, మధ్య ఒడిస్సా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో గాలి విచ్ఛిత్తిగా మరొక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. రాగల నాలుగు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ రోజు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే..

ఈ రోజు (జూన్‌ 11) గరిష్టంగా ఖమ్మంలో 36.4, కనిష్టంగా మెదక్‌లో 29.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవానం ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాచలం లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఏపీలో బెంబేలెత్తిస్తున్న విభిన్న వాతావరణం

అటు ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఓ వైపు వర్షాలు, మరోవైపు మాడు పగిలే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో నేడు ఏపీలోనూ పలు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే నేడు పలు జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటనున్నాయి. నిన్న వేమవరంలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. మన్యం జిల్లా సాలూరులో 43మి.మీ వర్షపాతం నమోదైంది. వాయువ్య ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళావాడం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ చత్తీస్‌ఘఢ్, మధ్యం మీదుగా సగటు సముద్ర మట్టానికి 9 కి.మీ ఎత్తురో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రధానంతో రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరోవైపు కొన్నిచోట్ల ఉక్కపోతతో పాటు ఎండలు ప్రభావం చూపే అవకాశముందని, విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. నేడు బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు: ఎన్టీఆర్, గుంటూరు. పల్నాడు. నెల్లూరు జిల్లాల్లో 40- 6డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది.

రానున్న మూడు రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే..

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో బుధవారం ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉంది. నిన్న మంగళవారం సాయంత్రం 5 గంటల సమయం వరకు మన్యం జిల్లా సాలూరులో 43మి.మీ., శ్రీకాకుళంలో 42.7మి.మీ., విశాఖ జిల్లా ఆనందపురంలో 37.5మి.మీ. వర్షపాతం రికార్డైంది. ప్రకాశం జిల్లా వేమవరంలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకాగా, కొనకనమిట్లలో 39.9. తిరుపతి జిల్లా మంగ నెల్లూరు 39.9, కడప జిల్లా ఎర్రగుంట్లలో 39.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనాయి. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జనం అల్లాడిపోతున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *