Life Style: ఈ ఐదు సమస్యలు ఉన్నవారు పెరుగు ముట్టుకుంటే ప్రమాదం !

పెరుగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ కొన్ని సమస్యలు ఉన్న వారు మాత్రం పెరుగు తినకుండా ఉండడం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు. ఏ సందర్భాలలో పెరుగు తినకుండా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. ఇది రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం. ఇందులోని ప్రోటీన్, కాల్షియం తో పాటు గట్ కి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల ఉన్న వారు మాత్రం పెరుగు తినకుండా ఉండడం మంచిదని నిపుణుల సూచన. ఏ సందర్భాలలో పెరుగు తినకుండా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఆర్థరైటిస్ సమస్య
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న మహిళలు కూడా పెరుగు తినకూడదు. నిజానికి, పెరుగులో ప్రోటీన్, లాక్టిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులను పెంచుతుంది. అలాగె పెరుగు చల్లని ప్రభావం ఆర్థరైటిస్ సమస్యను తీవ్రతరం చేస్తుంది. ఇలాంటి వారు పెరుగు తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
తామర, దురద, ఇన్ఫెక్షన్, మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మహిళలకు పెరుగు కూడా హానికరం. అయితే పెరుగులో ఉండే బ్యాక్టీరియా చర్మ సున్నితత్వాన్ని పెంచుతుంది. తద్వారా అలెర్జీలు, దద్దుర్లు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
గర్భధారణ సమయంలో జీర్ణ సమస్యలు
సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది మహిళలకు గ్యాస్, అజీర్ణం లేదా అసిడిటీ వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో పుల్లని పెరుగు ఎక్కువగా తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. వాస్తవానికి, పుల్లని పెరుగు తినడం వల్ల కడుపు ఉబ్బరం లేదా గుండెల్లో మంట వస్తుంది. కావున ఈ సమయంలో పుల్లని పెరుగు తినడం మానుకోవాలి. లేదా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
ఫంగల్ ఇన్ఫెక్షన్
ఫంగల్ ఇన్ఫెక్షన్ సమయంలో కూడా పుల్లని పెరుగు ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల శరీరంలోని బ్యాక్టీరియా సమతుల్యత చెదిరిపోతుంది. పెరిగులొని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు యోని ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పెరుగు తినకుండా ఉండాలి.