Mudragada Padmanabha: ‘నా ఆరోగ్య పరిస్థితి ఇదే’.. ముద్రగడ సంచలన లేఖ
మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన ప్రస్తుత ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. నిత్యం తన ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానన్నారు.
మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. ఈ మేరకు ఆయన రిలీజ్ చేసిన లేఖలో పేర్కొన్న అంశాల విషయానికొస్తే.. ఈ మధ్య తమ కుటుంబంపై మరొక కుటుంబం దాడి చేస్తున్న సంగతి అందరికీ తెలుసు అని అన్నారు. అయితే ఆ కుటుంబానికి, తమకు చాలా ఏళ్ల క్రితమే మనస్పర్థాలు వచ్చాయని అన్నారు.
ముద్రగడ సంచలన లేఖ
దీంతో ఒక ఏడాది నుండి తమకు వారికి పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయని.. వారి జోలికి తాను వెళ్ళడం లేదని తెలిపారు. అయినా వారు తమ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని ఆ లేఖలో రాసుకొచ్చారు. అయితే దీనికీ ఓ కారణం ఉందని తెలిపారు. తమ చిన్న కొడుకు గిరిబాబు ఎదుగుదల చూడలేకే అసూయపడి రగలిపోతున్నారని అన్నారు.