ఏపీలో ఒక్కసారిగా కుంగిపోయిన నేషనల్ హైవే.. రోడ్డు మధ్యలో పెద్ద గుంత, ఏమైందంటే

ర్నూలు దగ్గర జాతీయ రహదారిపై ఊహించని ప్రమాదం! భూమి ఒక్కసారిగా కుంగిపోయి భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు ఆందోళన చెందారు. రహదారి పక్కనే ఇలా జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది? సొరంగం తవ్వకాలే కారణమా? అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరమ్మతులు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం చదవండి!
ఏపీలోని కర్నూలు దగ్గర నేషనల్ హైవేపై ఉన్నట్టుండి భారీ గుంత ఏర్పడింది. గురువారం సాయంత్రం దూపాడు దగ్గర రింగురోడ్డు వద్ద బెంగళూరు-హైదరాబాద్ నేషనల్ హైవే-44పై భూమి కుంగిపోయింది. ఆరు మీటర్ల వెడల్పు, పదహారు మీటర్ల లోతులో పెద్ద గొయ్యి ఏర్పడింది. హైవే పక్కన రోడ్డు కుంగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నిర్మాణంలో భాగంగా భూగర్భంలో సొరంగాలు తవ్వుతున్నారు. ఈ క్రమంలో మట్టి క్రమంగా సొరంగంలో పడిపోయి గొయ్యి ఏర్పడిందని చెబుతున్నారు. కాంట్రాక్ట్ సంస్థ ఈ సొరంగ మార్గం నిర్మాణ పనులు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు.