ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా.. తెలంగాణకు విలన్ కాంగ్రెస్.. కేసీఆర్

“60ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణకు ఎంత గోస.. ఎంత దుఃఖం. గోదావరి, కృష్ణ నీళ్లు తట్టకుండా తరలిపోతే, తల్లి చనుబాలకు నోచని బిడ్డల్లాగా తెలంగాణ ప్రజలు రోదించారు. అర్ధరాత్రి కరెంటు పెట్టబోయి పాములు కుట్టి, తేళ్లు కుట్టి అనాథల్లా రైతులు చనిపోయారు. అయినా ఆ నాడు ఇక్కడి కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకున్నరు తప్ప ఏనాడూ కొట్లాడలేదు. ఏనాడూ తెలంగాణ సోయిని ప్రదర్శించలేదు. అనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే” అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.
- జలదృశ్యం నుంచి జనదృశ్యం @ బీఆర్ఎస్ 25
- తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపింది నెహ్రూ
- 1969లో 400 మందిని కాల్చిచంపింది ఇందిర సర్కారు
- బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకొని 14 ఏండ్లు ఏడిపించిండ్రు
- తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది బీఆర్ఎస్ బిడ్డలు
- పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులు
- వరుసపెట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించినోడు లేడు
- అధికారంలోకి రావడానికి ఎన్ని మాయమాటలు చెప్పిండ్రు
- ఉన్న గాంధీలు, లేని గాంధీలు దిగివడి ఊర్లపొంటి తిరిగిండ్రు
- హామీలే కాదు.. బుక్కులిచ్చి, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు
- తెలంగాణల ఎందరు దేవుళ్లున్నరో అందరి మీద ఒట్లు పెట్టిండ్రు
- ఇప్పుడెవడూ నమ్ముతలేడు.. అప్పు పుడుతలేదని మాటలు
- ఇంత మోసం.. ఇంత దగానా? రాష్ర్టాన్ని నాశనం చేసిండ్రు
- ఎంత మంచిగున్న తెలంగాణను బొందల పడగొట్టిండ్రు
- యాడాదిల గింత గల్లంతా.. కేసీఆర్ పక్కకు పోంగనే ఆగమా?
- ఈ కాంగ్రెసోళ్లకు ఏం మాయరోగమచ్చె? ఏం బీమారొచ్చె?
- చెరువుల పూడికతీసిన బుల్డోజర్లు నేడు ఇండ్లు కూలుస్తున్నయ్
- ముందుకు పోవాల్సిన తెలంగాణ ఎన్కకు పోతాంది
- యూనివర్సిటీల భూమి అమ్ముతరా?.. విచక్షణ ఉండొద్దా?
- మేం ప్రభుత్వాన్ని కూల్చం.. ప్రజలే మీ ఈపులు సాప్ జేస్తరు
- పోలీస్ మిత్రులారా మీకెందుకు దునుకులాట?
- మీ డైరీలల్ల రాసి పెట్టుకోండ్రి.. మేమే వస్తున్నం..జాగ్రత్త!
- ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది!
- పదేండ్ల పాలనలో అద్భుతాలు చేసి చూపినం
- ఇప్పుడు అన్ని రంగాలూ నాశనమైపోయినయ్
- నా కండ్లముందే ఇదంతా జరుగుతదనుకోలే
- నా మనసుకు ఎంతో బాధైతుంది.. దుఃఖమైతుంది
- మన తెలంగాణ మళ్లీ విజయం సాధించాలె
- ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చిందాలె
- ఎక్కడ పోగొట్టుకున్నమో అక్కడనే వెతకాలె
- బీఆర్ఎస్ రజతోత్సవ సభావేదికపై కేసీఆర్ ఆవేదన
- తెలంగాణ ప్రజల కష్టాలపై గద్గదమై తొణికిన స్వరం
- కాంగ్రెస్కున్నది రెండున్నరేండ్లే వచ్చేది బీఆర్ఎస్ సర్కారే
- దాన్ని ఎవరూ ఆపలేరు.. ఆపడం ఎవరి తరమూ కాదు
- ఇక నేనే బయల్దేరుత.. అన్ని లెక్కలు తీస్త: కేసీఆర్
ఎంత మంచిగుండె తెలంగాణ.. బొందలపడేసిండ్రు.. నా కండ్ల ముందే ఇట్లయితదనుకోలే.. దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన తెలంగాణను ఇప్పుడు 14, 15వ స్థానంలోకి పడేసిండ్రు. నా కండ్ల ముందు గిట్ల జరుగుతది.. గింత మాయిలమే అయితది.. ఇంత మోసం చేస్తరని అనుకోలే. ఇయ్యాల చాలా బాధ కలుగుతున్నది. చాలా దుఃఖం కలుగుతున్నది. ఇంకా ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనకకు పోతున్నది. దీనికి కారణం ఎవరు..? ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కాదా? వాళ్లను నిలబెట్టి అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? అడగాలె!