వేసవి వచ్చిందంటే.. ఇంట్లో పుచ్చకాయ ఉండాల్సిందే

ఎలా తీసుకున్నా మంచిదే..
వేసవి వచ్చిందంటే.. ఇంట్లో పుచ్చకాయ ఉండాల్సిందే! మండే ఎండల్లో శరీరానికి చల్లదనాన్ని ఇవ్వాలన్నా, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండాలన్నా.. ఈ పండును ఆశ్రయించాల్సిందే! అయితే, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పుచ్చకాయను ముక్కలుగా కోసుకొని తింటే బెటరా? జ్యూస్ చేసుకొని తాగితే మంచిదా?

ముక్కలుగా తింటే..
- పుచ్చకాయను కట్ చేసుకొని తినడం వల్ల ఇందులో సితోపాటు యాంటి ఆక్సిడెంట్లు శరీరానికి పూర్తిగా అందుతాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
- పుచ్చకాయను ముక్కలుగా కోసుకొని తింటే.. అందులో ఉండే ఫైబర్ శరీరానికి పూర్తిగా అందుతుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
- ముక్కలు తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
- పుచ్చకాయలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. తక్కువ ైగ్లెసెమిక్ ఇండెక్స్ ఉన్నప్పటికీ.. పుచ్చకాయను ముక్కలుగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి.
‘జ్యూస్’గా తాగితే..
- జ్యూస్‌గా తాగితే.. పుచ్చకాయ గింజలతో ఇబ్బంది ఉండదు. ముక్కలు తినడం కష్టంగా అనిపించేవారు జ్యూస్ తాగడం మేలు.
- వేసవిలో డీహైడ్రేషన్ ఎక్కువగా బాధిస్తుంది. పుచ్చకాయ జ్యూస్.. ఈ సమస్యను ఇట్టే నివారిస్తుంది. జ్యూస్ తాగడం వల్ల శరీరం చల్లబడటంతోపాటు శరీరంలోని నీటి స్థాయిలు సమతూకంలో ఉంటాయి.
- శరీరానికి తక్షణ శక్తి కావాల్సి వచ్చినప్పుడు పుచ్చకాయను ‘జ్యూస్’ చేసుకొని తాగడం మంచిది. దీనివల్ల శరీరానికి సత్వర శక్తి లభిస్తుంది. ముఖ్యంగా జిమ్, వ్యాయామం చేసేవాళ్లు జ్యూస్ తాగడం బెటర్.