Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

- శ్రీరాముడు ఈ రోజు మధ్యాహ్నం పుష్య నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. రామ నవమి అనేది శ్రీరాముని జననాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. శ్రీరాముడు అయోధ్య రాజు దశరథుడు, కౌసల్య దంపతుల కుమారుడిగా విష్ణువు ఏడవ అవతారంగా జన్మించాడు.
- Sri Rama Navami 2025: హిందూ మతంలో శ్రీరామ నవమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చైత్ర మాసం తొమ్మిదవ రోజున వస్తుంది. ఈ పండుగను విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముని జన్మదినమైన నవమి నాడు జరుపుకుంటారు. శ్రీరాముడు ఈ రోజు మధ్యాహ్నం పుష్య నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. అయోధ్య రాజు దశరథుడికి ముగ్గురు భార్యలు. కౌసల్య, కైకేయి, సుమిత్ర. కానీ ఎవరికీ కొడుకులు లేరు. తరువాత రుషుల సలహా మేరకు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసాడు. ఈ యాగానికి సంతోషించిన ప్రజాపతి దశరథుడికి దివ్య ఆహారాన్ని అర్పిస్తాడు.
- శ్రీరాముని జననాన్ని పురస్కరించుకుని..
దశరథుడు ఈ దివ్య పానీయాన్ని తన ముగ్గురు భార్యలకు పంచుతాడు. అదేవిధంగా చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజు, పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మిస్తాడు. పుష్య నక్షత్రంలో పదవ రోజు సూర్యోదయానికి ముందు కైకేయికి భరతుడు జన్మిస్తాడు. అదే రోజు మధ్యాహ్నం ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. అందువలన రాముడు జన్మించిన నవమిని రామ నవమిగా జరుపుకుంటారు. రామ నవమి అనేది శ్రీరాముని జననాన్ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. శ్రీరాముడు అయోధ్య రాజు దశరథుడు, కౌసల్య దంపతుల కుమారుడిగా విష్ణువు ఏడవ అవతారంగా జన్మించాడు.
హిందూ గ్రంథాలలో చెప్పినట్లుగా రాముడు నాలుగు యుగాలలో ఒకటైన త్రేతా యుగంలో జన్మించాడు. ఈ రోజున రాముడిని పూజిస్తే దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్మకం. శ్రీరామ నవమి నాడు శ్రీరామ తత్వం భూమిపై గతంలో కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా చురుకుగా ఉంటుంది. అందువల్ల ఈ రోజున రామనాప జపించడం, శ్రీరాముడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. రామ అనే పదంలోని రెండు అక్షరాలకు ఒక ముఖ్యమైన అర్థం ఉంది రా అంటే వెలుగు.. మ అంటే లోపల. అంటే మీలోని దివ్య కాంతి రాముడు అని అర్థం