Moon: చంద్రుడిపై నిర్మాణాలు.. బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ
చంద్రుడిపై ఉష్ణోగ్రతలకు కారణంగా నిర్మాణాలు చేపడితే ఇటుకలు ఎక్కువగా బీటలువారే ప్రమాదం ఉంటుంది. పగిలిన ఇటుకలను మరమత్తులు చేయడానికి బెంగళూరులోని IISC పరిశోధకులు ఓ పదార్థాన్ని కనుగొన్నారు. స్పోరోసార్సినా పాశ్చరీ అనే బ్యాక్టీరియాతో ఓ పదార్థాన్ని తయారు చేశారు.
చంద్రమండలంపై మానవ మనుగడ గురించి ప్రస్తుతం అధ్యాయనాలు జరుగుతున్నాయి. ఒకవేళ చంద్రుడిపై మనుషుల నివాసం సాధ్యమైతే.. అక్కడ నిర్మాణాలు చేయడానికి ఇటుకలు కావాలి. అంతేకాదు మూన్ మీద ఉన్న వైవిధ్య ఉష్ణోగ్రతల కారణంగా ఇటుకలు బీటలువారే ప్రమాదముంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. చంద్రునిపై వాతావరణం కఠినంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఒక్కరోజులో 121 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగి.. మైనస్ 133 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతూ ఉంటుంది. అంతేకాక తీక్షణమైన సౌర పవనాలు, తోకచుక్కలు అక్కడ నిత్యకృత్యమే. అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో స్పోరోసార్సినా పాశ్చరీ అనే బ్యాక్టీరియాను ఉపయోగించడం వల్ల ఇటుకల్లో పగుళ్లును నియంత్రించడానికి ఓ పదార్థాన్ని కనుగొన్నారు. అది కూడా చంద్రుడిపై ఉండే బ్యాక్టీరియాతో తయారు చేశారు.