Venkatesh: వెంకటేష్ ఫ్యామిలీకి చంద్రబాబు సర్కార్ షాక్!
నటుడు వెంకటేష్ ఫ్యామిలీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనుంది.
AP: నటుడు వెంకటేష్ ఫ్యామిలీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనుంది.
ఈ మేరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 34.44 ఎకరాల భూమిని సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రామానాయుడు స్టూడియోకు కేటాయించారు. అయితే ఈ భూములను రియల్ ఎస్టేట్ కు ఉపయోగించడంపై ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాలల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అందులో అంతటా స్టూడియో నిర్మించలేదని, మిగిలిన బూమిని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నట్లు గుర్తించి చర్యలకు సిద్ధమైంది.
2023లో 15.17 ఎకరాలను రియల్ ఎస్టేట్ గా మార్చి నివాస ప్రాంతాలుగా వినియోగించుకునేందుకు రామానాయుడు స్టూడియో యాజమాన్యం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉదంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇచ్చిన ప్రయోజనం కోసం కాకుండా ఇతర పనులకు ఉపయోగిస్తే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు వెల్లడించిది. ఈ నేపథ్యంలో రెవిన్యూశాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా.. రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విశాఖ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
వారు ఇచ్చే వివరణ ఆధారంగా భూములను వెనక్కి తీసుకుని అధికారిక ఉత్తర్వులు జారీ చేసే ఛాన్స్ ఉంది.