Solar Eclipse 2025: రేపే సూర్యగ్రహణం.. మన దేశంలో దాని ప్రభావం ఏమిటి?

 Solar Eclipse 2025: రేపే సూర్యగ్రహణం.. మన దేశంలో దాని ప్రభావం ఏమిటి?

ఈ సంవత్సరం పాల్గుణ మాసం అమావాస్య మార్చి 29వ తేదీన సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈ రోజున ఏర్పడనుంది. అటువంటి పరిస్థితిలో 2025 మార్చి 29న సంభవించే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ రోజున తెలుసుకుందాం..

ఈ సంవత్సరం హోలీ సందర్భంగా అంటే మార్చి 14న సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం సంభవించింది. ఇప్పుడు ఈ నెలలోనే మరో గ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో రెండవ గ్రహణం సూర్యగ్రహణం మార్చి 29వ తేదీ 2025న సంభవిస్తుంది. ఈసారి మార్చి 29న చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడనున్నదని మాత్రమే కాదు.. ఈ రోజున ఒకేసారి అనేక శుభ యోగాలు ఏర్పడతాయి కనుక.

జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 29న పాల్గుణ అమావాస్య. ఈ రోజున సూర్యగ్రహణంతో పాటు శని సంచారము కూడా జరగనున్నాయి. జ్యోతిషశాస్త్రంలో సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భావిస్తారు. మార్చి 29న సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు మీన రాశిలో ఉంటారు. దీని వలన ఈ గ్రహణం ప్రభావం మరింత ముఖ్యమైనదిగా మారింది జ్యోతిష్కులు చెబుతున్నారు.

భారతదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా?

జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు.. సూర్యుడికి, భూమికి మధ్య వచ్చినప్పుడు.. చంద్రుని వెనుక ఉన్న సూర్యుని నీడ కొంత సమయం వరకు పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ ప్రక్రియనే సూర్యగ్రహణం అంటారు. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అంతేకాదు ఈ గ్రహణం భారత దేశ కాల మానం ప్రకారం రాత్రి సమయంలో సంభవిస్తుంది. కనుక భారతదేశంలో కనిపించదు. అందువల్ల ఈ గ్రహానికి మన దేశంలో మతపరమైన ప్రభావం ఉండదు. సూతక కాలం కూడా చెల్లదు. అటువంటి పరిస్థితిలో ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపదు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *