ముగిసిన శ్యామల విచారణ.. కీలక ప్రకటన
బెట్టింగ్ యాప్ కేసులో శ్యామల విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్లకు పాల్పడటం తప్పేనని ఒప్పుకుంది. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది.
BIG BREAKING: బెట్టింగ్ యాప్ కేసులో శ్యామల విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది. బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్లకు పాల్పడటం తప్పేనని ఒప్పుకుంది. పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నా.బెట్టింగ్ యాప్ ల ద్వారా చనిపోయిన వారిని ఎవరు భర్తీ చేయలేరని చెప్పింది.
హైకోర్టులో పిటిషన్..
ఈ మేరకు ఒక సామాజిక కార్యకర్త ఫి
ర్యాదు మేరకు శ్యామలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమెను విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపించారు. ఆ నోటీసులకు ఆమె స్పందించకపోగా.. విచారణకు హాజరుకాకుండానే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడంతో హైకోర్టు విచారించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. యాంకర్ శ్యామలను అరెస్టు చేయవద్దని, నోటీసులు ఇచ్చి విచారించాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం పోలీసుల విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం సూచించగా.. ఉదయమే విచారణకు హాజరైంది. ఆంధ్రా 365 అనే బెట్టింగ్ యాప్ను గత కొంతకాలంగా శ్యామల ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.