Balmur Venkat : కేటీఆర్ కు ENO ప్యాకెట్లు పంపించిన బల్మూర్ వెంకట్.. ఎందుకో తెలుసా?
తెలంగాణ రాష్ర్టాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ నేతల కడపుమంట తగ్గడం కోసం కేటీఆర్ కు ENO ప్యాకెట్లు పంపిస్తున్నట్లు వెంకట్ తెలిపారు.
Balmur Venkat : తెలంగాణ రాష్ర్టాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ నేతల కడపుమంట తగ్గడం కోసం వారికి ENO ప్యాకెట్లు పంపిస్తున్నట్లు వెంకట్ తెలిపారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు కొరియర్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళకు జీర్ణించుకునే శక్తి పెరగడం కోసం ENO ప్యాకెట్లు పంపినట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలు విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమాశంలో ఆయన మాట్లాడుతూ.. రైజింగ్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి బృందం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకు వచ్చారని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో లక్షా 78 వేల 950 కోట్ల పెట్టుబడులను సీఎం రేవంత్ రెడ్డి తీసుకు రావడం గర్వించదగ విషయమన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక కడుపుమంటతో బీఆర్‌ఎస్ నాయకులు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. కడుపు మంట తగ్గడం కోసం ENO ప్యాకెట్లను పంపానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా “డైజెస్ట్ ది గ్రోత్ ‘ క్యాంపెయిన్‌లో భాగంగా కేసీఆర్, కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు పంపాలంటూ ఈ సందర్భంగా బల్మూరు వెంకట్ పిలుపు నిచ్చారు. కనీసం ఈనో ప్యాకెట్ల ద్వారనైనా అభివృద్ధిని జీర్ణించుకుంటారని అన్నారు, రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే గుడ్డలు ఊడదీసి కొడతామంటూ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు.
కాగా సీఏం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ మండిపడ్డారు. మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ వారికి కడుపు మండితే ఈనో తాగాలని సూచించారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు పంపినట్లు తెలిపారు.