AP Inter Exams: ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు నిజమేనా?: బోర్డు సంచలన ప్రకటన!

 AP Inter Exams: ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు నిజమేనా?: బోర్డు సంచలన ప్రకటన!

ఏపీలో ఇంటర్ ఫస్ట ఇయర్ పరీక్షలు రద్దు అంటూ ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ అంశంపై స్పందించింది. పరీక్షల రద్దు వార్త అవాస్తవమని స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయమై ఎలాంటి అపోహలకు గురి కావొద్దని స్పష్టం చేసింది.

ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు అంటూ ఈ రోజు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఇంటర్ బోర్డు స్పందించింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరినట్లు తెలిపింది.

అపోహలు గురికావొద్దు..

ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు bieap.gov.in  వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ ఎలాంటి అపోహలకు గురి కావొద్దని స్పష్టం చేసింది ఇంటర్ బోర్డు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *