AP: ఏపీ ప్రజలకు చంద్రబాబు కొత్త సంవత్సరం కానుక.. లక్ష గృహప్రవేశాలు!

 AP: ఏపీ ప్రజలకు చంద్రబాబు కొత్త సంవత్సరం కానుక.. లక్ష గృహప్రవేశాలు!

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు అందించనున్నారు.

AP: ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు అందించనున్నారు. అనంతరం ప్రజలతో కలిసి స్థానిక పరిపాలన, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

6.40 లక్షల ఇళ్ల నిర్మాణాలకూ అనుమతి..

ఇప్పటికే ‘మన ఇళ్లు-మన గౌరవం’ పేరుతో లబ్ధిదారుల్లో అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత  ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-ఎన్టీఆర్‌ గృహనిర్మాణ’ పథకం కింద ఇప్పటివరకు లక్ష గృహ నిర్మాణాలను పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 6.40 లక్షల ఇళ్ల నిర్మాణాలకూ కూడా ప్రభుత్వం ఇటీవలే అనుమతిచ్చింది. ఈ ఇళ్లను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు..

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచితంగా స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు/పట్టాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, చేనేతలకు కూడా ప్రభుత్వం అదనంగా సాయం చేయాలని భావిస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర వర్గాలకు ఇచ్చే యూనిట్‌ వ్యయం కంటే ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, చేనేతలకు రూ.50 వేలు అదనపు సాయం అందించనున్నట్లు చంద్రబాబు సర్కార్ తెలిపింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *