నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6:05 గంటలకు దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో విగ్రహావిష్కరణ చేయనున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ రోజు సాయంత్రం 6:05 గంటలకు దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ చేస్తారు. ఆ తర్వాత ఒకవైపు సీఎం ప్రసంగిస్తుండగా మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను సన్మానిస్తారు. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రచించిన కవి అందెశ్రీని, విగ్రహ రూపకర్తలు అయిన ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను ప్రభుత్వం సన్మానిస్తారు. విగ్రహావిష్కరణ తర్వాత ఎన్టీఆర్ మార్గ్ దగ్గర డ్రోన్ షో నిర్వహిస్తారు.