నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
నేటి నుంచి ఏపీలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. మీ భూమి-మీ హక్కు పేరుతో కూటమి ప్రభుత్వం 2025 జనవరి 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఏపీలో నేటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు.. భూరక్ష పథకం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో భూ సమస్యలను పరిష్కరించేందుకు మీ భూమి-మీ హక్కు పేరుతో కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది. నేటి నుంచి 2025 జనవరి 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు దాదాపుగా 17,564 గ్రామాల్లో ఈ సదస్సును నిర్వహిస్తారు.
ఈ సదస్సుకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రజలు ప్రభుత్వం దగ్గరకు వెళ్లేలా కాకుండా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టింది. వీటి వల్ల ప్రజల భూ సమస్యలను పరిష్కరామవుతాని ప్రభుత్వం భావిస్తోంది.
గత ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. సర్వే తర్వాత ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో రైతులు అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అప్పటి నుంచి ఎన్నో అర్జీలు కూడా ప్రభుత్వానికి అందించారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం అక్టోబర్‌లో గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.
వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా రీసర్వే గురించి ఉండగా మిగిలినవి రెవెన్యూకి సంబంధించినవి ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసింది. ఈ రెవెన్యూ సదస్సుల కోసం ప్రతి మండలానికి, నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. అలాగే ఈ సదస్సులకు మండల నోడల్ అధికారి, తహసీల్దారు, ఆర్‌ఐ, మండల సర్వేయర్, వీఆర్వో, గ్రామ సర్వేయర్ అందరూ కూడా హాజరవుతారు.