హైదరాబాద్ నుంచి డీజిల్ బస్సులు, ఆటోలు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

 హైదరాబాద్ నుంచి డీజిల్ బస్సులు, ఆటోలు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో నష్టాలపాలైన సంస్థను లాభాలబాట పట్టించామన్నారు. కొత్తలోగో ఆవిష్కరించి.. హైదరాబాద్ లో ఇకపై డీజిల్ బస్సులు, ఆటోలకు స్వస్తిపలికేలా చర్యలు తీసుకుంటామన్నారు

TGS RTC: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 43 వేల మంది ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని లాభాలబాట పట్టించామన్నారు.

ఆర్టీసీ లోగో ఆవిష్కరణ..

ఈ మేరకు ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన సభలో కొత్త ఆర్టీసీ లోగోను ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ వస్తే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని భావించినా కేసీఆర్ నష్టాలపాలు చేశాడని విమర్శించారు.  ‘కేసీఆర్ పాలనలో ఆకాంక్షలు నెరవేరకపోవడంతో ఉద్యమం చేశారు. కానీ మా ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేపడుతోంది. ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించాం. ఆర్టీసిని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. తెలంగాణలో రవాణను కాపాడాల్సిన బాధ్యతమాపై ఉంది. ఇప్పటికే 4వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించింది.  నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసిని లాభాల బాట పట్టించాం. ఇప్పటికి 115 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *