Pushpa-2 : ‘పుష్ప2’ టికెట్ రేట్ల పెంపు కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

 Pushpa-2 : ‘పుష్ప2’ టికెట్ రేట్ల పెంపు కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

‘పుష్ప 2’ రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషన్ పై విచారించిన న్యాయ స్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఇలాంటి తరుణంలో ‘పుష్ప2’ టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్‌కు అదనంగా రూ.800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంగళవారం కోర్టులో విచారణ జరిగింది.

‘పుష్ప2’ కి లైన్ క్లియర్..

ఈ మేరకు తెలగాణ హైకోర్టు చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేమంటూ.. ‘పుష్ప 2’ సినిమా విడుదలకు  క్లియరెన్స్‌ ఇచ్చింది.  ఈ మేరకు విడుదల చేసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో  బెనిఫిట్‌ ద్వారా వచ్చే  కలెక్షన్ల  వివరాలను తమకు తెలియజేయాలని నిర్మాతలను ఆదేశించింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *