ApsRTc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే!

 ApsRTc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు చెప్పారు.

APS RTC: ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..ఎన్నికల సమయంలో ఇచ్చిన టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ఇది. ఈ హామీ అమలు కోసం రాష్ట్రంలోని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీలో ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అని ఎంతోమంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కోసం అధ్యయనం చేస్తున్నట్లు  నారాయణ చెప్పారు. ఈ పథకం అమలుపై త్వరలోనే మహిళలకు శుభవార్త చెప్పనున్నట్లు చెప్పారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు.

మరోవైపు ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులలో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు   నారాయణ చెప్పారు. ప్రయాణికుల భద్రత, మెరుగైన సేవలతో పాటుగా ఆర్టీసీని లాభాల బాట పట్టించడం కోసం చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే 1600 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. 1600 కొత్త బస్సులు కొనేందుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందన్న ఆయన.. ఇప్పటికే 900 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద సంఖ్యలో..

మిగతా వాటిని కూడా త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు వివరించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న ఆర్టీసీ బస్టాండ్లలో మరమ్మత్తులు చేస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద సంఖ్యలో నడిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. మరోవైపు అర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి వస్తుందంటూ ముందు వార్తలు వచ్చాయి.

అయితే ప్రభుత్వం నుంచి ఆ దిశగా అడుగులు పడలేదు. ఆ తర్వాత దీపావళికి ప్రారంభిస్తారని ప్రచారం జరగ్గా.. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే పొరుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలు పరిశీలించిన తర్వాతే ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *