సుబ్బయ్యగారి హోటల్ సీజ్.. భోజనంలో జెర్రీ

 సుబ్బయ్యగారి హోటల్ సీజ్.. భోజనంలో జెర్రీ

ఈ మధ్య బయట దొరికే బిర్యానీలు, ఇతర భోజనాలలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు దర్శనమివ్వడం చాలా సాధారణమైపోయింది. ఏ మాత్రం శుభ్రత, నాణ్యత లేకుండా ప్రజలకు భోజనం అందిస్తున్నాయి పలు రెస్టారెంట్స్, హోటల్స్. దీని వల్ల జనాల ప్రాణం మీదకు వస్తోంది. కొన్ని హోటల్స్ అయితే పేరుకు మాత్రమే ఫేమస్.. లోపల చూస్తే అంతా కలుషితం. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి హోటల్ బాగోతమే బయటపడింది.

సుబ్బయ్య హోటల్లో జెర్రీ

కాకినాడ సుబ్బయ్యగారి  హోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో అందరికీ తెలుసు. వెజిటేరియన్ ఫుడ్ కు ఈ హోటల్ మరింత పాపులర్. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లో పలు చోట్లలో ఈ హోటల్ బ్రాంచ్ లు ఉన్నాయి. అయితే విజయవాడ బ్రాంచ్ హోటల్లో ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన భోజనంలో జెర్రీ రావడం కలకలం సృష్టించింది. భోజనం చేయడానికి వచ్చిన ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వగా.. అందులో జెర్రీ దర్శనమివ్వడం కస్టమర్ ని షాక్ కు గురిచేసింది. అయితే  అదే సమయంలో అదే హోటల్లో భోజనం చేస్తున్న కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ (NHRC) ఇంఛార్జ్‌ చైర్మన్ విజయభారతి సయానీ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో హోటల్ నిర్వాహకుల తీరుపై సీరియస్ అయ్యారు. NHRC  ఇంఛార్జ్‌ చైర్మన్ విజయభారతి ఈ వ్యవహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల ఫిర్యాదు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ హోటల్‌ను పరిశీలించి.. సీజ్ చేశారు. అలాగే శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *