Lady Agori : తెలంగాణకు రీఎంట్రీ.. ఆత్మాహుతికి అఘోరీ రెడీ

 Lady Agori : తెలంగాణకు రీఎంట్రీ.. ఆత్మాహుతికి అఘోరీ రెడీ

తెలంగాణకు అఘోరీ తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీలో ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను సందర్శించింది. హిందూ దేవాలయాల, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మాహుతి చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది అఘోరీ

శివ తాండవం చేస్తానంటూ…

ఇటీవల ఆర్టీవీతో అఘోరీ మాట్లాడింది. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ తానుంటా అని పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణలో తనను అపే మగాడు ఇంకా పుట్టలేదని మాట్లాడింది. తెలంగాణలో శివ తాండవం జరగబోతుందని.. ఆడపిల్ల మీద చేయి వేసినవాడి మర్మాంగాలు కోసేస్తా అని అఘోరీ చెప్పుకొచ్చింది.

తెలంగాణలో ఆలయాలను ధ్వంసం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని మండిపడింది. మరోవైపు  పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని.. అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేశం ఇంకా అందలేదని అఘోరీ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా మరోవైపు ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. బెల్లంపల్లిలో నిర్వహించే లక్ష దీపాల మహోత్సవానికి తరలి రండి అని ఆ వీడియోలో పేర్కొంది. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తెలిపింది. స్త్రీలపై దాడులను ఆపే శక్తి మన దగ్గర ఉందని చెప్పుకొచ్చింది. గోహత్యలను నివారించేందుకు పోరాడుదాం అని పేర్కొంది

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *