హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి..!

 హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి..!

హైదరాబాద్ నగరంలో బస్సుల్లో ప్రయాణించేవారికి అలర్ట్. ఈనెల 21 నుంచి 24 వరకు సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవటమో.. ప్రత్యామ్నాయమార్గాలు చూసుకోవటమో చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా బస్సులు అక్కడికి వెళ్తుండటంతో నగరంలో బస్సుల సంఖ్య తగ్గనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో తిరిగే 2,850 సిటీ బస్సుల్లో దాదాపు 2 వేల వరకు మేడారం జాతరకు వెళ్లనున్నాయి.

ఇప్పటికే కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు జాతరకు కేటాయించారు. ఈ నెల 21 నుంచి పూర్తి స్థాయిలో బస్సులు మేడారానికి వెళ్లనున్నాయి. ఇందులో 250 బస్సులు నగరం నుంచి బయలుదేరనుండగా.. మిగతా బస్సులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తరలిపోనున్నాయి. ఆయా రోజుల్లో పనులు పెట్టుకుని ఆటోలు, క్యాబ్‌ల దోపిడీకి గురికాకుండా ఉంటారనే ఉద్దేశంతో హెచ్చరిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక నగరంలో తిరిగే మహిళా ప్రయాణికుల సంఖ్య 11 లక్షల నుంచి 18 లక్షలకు చేరింది. ప్రస్తుతం ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఇలాంటి తరుణంలో మేడారం జాతరకు లక్షలాది మంది ప్రయాణికులుంటారని టీఎస్‌ఆర్టీసీ అంచనా వేసింది. అందుకే నగరంలోని 2 వేల బస్సుల వరకూ జాతరకు కేటాయించారు. ఆ బస్సులు పోనూ.. కేవలం 850 బస్సులే నగరవాసులకు అందుబాటులో ఉండనున్నాయి. కాబట్టి ఈ నాలుగు రోజులు బస్సుల్లో ప్రయాణించి పనులు చక్కబెట్టుకోవాలని అనుకునేవారు తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకుంటే ఉత్తమం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *