03 ఫిబ్రవరి 2024:ఈరోజు మకరం, కుంభం, మీనంతో సహా ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం.

 03 ఫిబ్రవరి 2024:ఈరోజు మకరం, కుంభం, మీనంతో సహా ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మరోవైపు మీ పిల్లల కంపెనీ గురించి ఆందోళన చెందుతారు. మీకు ఎవరితోనైనా వివాదాలు ఉంటే, సకాలంలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామి యొక్క అన్ని తప్పులను విస్మరించాలి. ఈరోజు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మంచి మానసిక స్థితి కారణంగా, మీ పని మంచి వేగంతో పురోగమిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది.

పరిహారం : ఈరోజు రాత్రి నల్ల కుక్కకు రోటీ తినిపించాలి.

​వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సమయం కేటాయించుకోవాలి. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుతం బాధాకరంగా ఉండొచ్చు. మీ ప్రేమ సంబంధాలలో కూడా సాన్నిహిత్యం ఉంటుంది. వ్యాపారంలో పని వ్యవస్థను మెరుగుపరచండి. న్యాయపరమైన విషయాలను పరిష్కరించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఒత్తిడి, అలసట కారణంగా బలహీనత అనిపించొచ్చు. విహారయాత్రకు వెళ్లేటప్పుడు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి. మీరు ఆఫీసులో పని చేస్తుంటే మీ తప్పుల గురించి చాలా సీరియస్‌గా ఉండండి.

పరిహారం : ఈరోజు వినాయకుడికి దుర్వా సమర్పించాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు అనేక రంగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. నిస్సహాయ వ్యక్తికి చికిత్సలో మీరు సహాయం చేయొచ్చు. ప్రేమ జంట ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటారు. మీ ఇంటి జీవితంలో ఈ సమయం చాలా మంచిది. మీరు వ్యాపారంలో చాలా రిస్క్ తీసుకుంటారు. ఇది భవిష్యత్తులో సరైనదని నిరూపించొచ్చు. విద్యార్థులు ఏదైనా కోర్సులో చేరినట్లయితే, మీరు దాని ప్రయోజనాలను పొందుతారు. మీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉండొచ్చు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివునికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు అనుభవాలు, జ్ఞాపకాలు కాలక్రమేణా విచ్ఛిన్నం కాని లేదా మసకబారని విషయాలు కావాలి. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. ఇది మీ వైవాహిక జీవితాన్ని బలపరుస్తుంది. ఈరోజు ఆన్‌లైన్ లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులకు జీతాల పెంపు, పదోన్నతులు లభించే అన్ని అవకాశాలు ఉన్నాయి.

పరిహారం : ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పేదలకు సాయం చేయడంలో విజయం సాధిస్తారు. చాలా కాలం తర్వాత మీరు పాత సన్నిహిత స్నేహితుడిని కలుసుకోగలుగుతారు. ఈరోజు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని మంచి అవకాశాలను కూడా పొందొచ్చు. మీ పెండింగ్ డబ్బును కూడా పొందొచ్చు. మీ వ్యాపార ప్రణాళికను రహస్యంగా ఉంచాలి. మీరు ఏ పనిలో నిమగ్నమై ఉన్నా, దాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు కొంత పార్ట్ టైమ్ వర్క్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

పరిహారం : ఈరోజు శ్రీ విష్ణుమూర్తిని పూజించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మొబైల్, ఈ-మెయిల్ ద్వారా శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. మీలో కొందరికి కుటుంబంలో ఉత్సాహాన్ని కలిగించే పని చేయాల్సి ఉంటుంది. అసత్యాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో శత్రువుల నుండి విముక్తి పొందుతారు. ఈరోజు కొంచెం కష్టపడితే పెద్ద లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో ఏదైనా కొత్త నియమాన్ని అమలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ సంబంధిత వ్యాపారంలో లాభదాయక పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.

పరిహారం : ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.

​తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు అనేక విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. అయితే కొన్ని అశుభవార్తలను వినే అవకాశం ఉంది. మీ కోరిక మేరకు ఏదైనా పని పూర్తయితే మీ జీవిత భాగస్వామి మీతో సంతోషంగా ఉంటారు. మీరు ఒంటరిగా ఉంటే, మిమ్మల్ని మీరు బహిర్గతం చేయడానికి వెనుకాడరు. ఈరోజు అనేక మూలాల నుండి ఆర్థిక లాభం సాధ్యమవుతుంది. మీ కార్యాలయంలో ప్రతి విషయాన్ని మీ సొంత స్థాయిలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలను పొందుతారు. యువత పనికిరాని పనుల నుంచి దృష్టి మరల్చి కెరీర్‌పై దృష్టి పెట్టాలి.

పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.

వృశ్చిక రాశి(Scorpio Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా రంగాల్లో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ గోప్యతలో జోక్యం చేసుకునే వారి నుండి మీరు దూరంగా ఉండాలి. మీ విధులు, బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒక వ్యక్తి పట్ల పెరుగుతున్న ఆకర్షణ ఒక వైపు మాత్రమే అని గ్రహించొచ్చు. ఈరోజు మీ ఆర్థిక సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు మీకు కుటుంబ వ్యాపారంలో మీ జీవిత భాగస్వామి సలహా అవసరం. స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు.

పరిహారం : ఈరోజు కృష్ణుడిని పూజించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన విజయాలను పొందుతారు. కోర్టు సంబంధిత కేసులలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను ఇతరులతో షేర్ చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. కుటుంబం, పిల్లలతో సమయం గడపడం వల్ల మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈరోజు దంపతులకు ప్రేమానురాగాలతో కూడిన రోజు అవుతుంది. ఈరోజు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీ ముఖ్యమైన ప్రణాళికలను అమలు చేయడానికి ఇదే సరైన సమయం. ఉద్యోగులు ఉద్యోగాన్ని మార్చే ముందు, దాని గురించి సరైన సమాచారాన్ని పొందాలని నిర్ధారించుకోవాలి.

పరిహారం : ఈరోజు పార్వతీ దేవిని పూజించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తాయి. మీరు పరీక్షలో బాగా రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మంచి అనుభూతిని పొందుతారు. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయొద్దు. మీ వ్యాపార పరిచయాలను విస్తరించండి. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు చాలా సరదాగా ఉంటారు.

పరిహారం : ఈరోజు బ్రాహ్మాణులకు దానం చేయాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను పొందుతారు. మీ ప్రశ్నలకు ఇంట్లోని వృద్ధులు లేదా మహిళ నుండి సమాధానాలు పొందొచ్చు. మీరు రిలేషన్ షిప్‌లో ఉన్నట్లయితే, మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండాలి. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. ఈరోజు మీరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిన్న మూలధనాన్ని పెట్టుబడి పెట్టొచ్చు. ప్రధానమైన ఆస్తిని కొనుగోలు చేయాలనే కల త్వరలో నెరవేరుతుంది. వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలొస్తాయి. అనేక లాభాలొచ్చే అవకాశాలున్నాయి.

పరిహారం : ఈరోజు శివయ్యకు చందనం సమర్పించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ మొండితనం కారణంగా మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావొచ్చు. వివాహానికి సంబంధించిన సమాచారం కోసం జ్యోతిష్యుడిని కలిసే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల పరంగా మీరు అదృష్టవంతులు అవుతారు. వివాహం చేసుకున్న వారు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. మీరు కోరుకోని దాని కోసం బలవంతంగా ఖర్చు చేయాల్సి రావొచ్చు. వ్యాపారులు ఈరోజు తమ ప్రమోషన్‌లపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు తమ పనులపై పూర్తి శ్రద్ధ వహించాలి. కొన్ని కారణాల వల్ల మీరు అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పరిహారం : ఈరోజు శని దేవుడిని తైలం సమర్పించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *