TSRTC: ‘మేడారం జాతర బస్సుల్లో మహిళలకూ టికెట్ వసూలు చేస్తాం..’
మేడారం సహా ఇతర జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు టికెట్ వసూలు చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదించారు. తద్వారా సంస్థకు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే సజ్జనార్ ప్రాతిపాదనను.. డిప్యూటీ సీఎం భట్టి తిరస్కరించారు. ఆ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించాలన్నారు.
ప్రధానాంశాలు:
- ప్రత్యేక బస్సుల్లో మహిళలకు టికెట్
- ప్రతిపాదించిన సంస్థ ఎండీ సజ్జనార్
- తిరస్కరించిన డిప్యూటీ సీఎం భట్టి
11 కోట్ల మందికి పైగా ప్రయాణం..
మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని.. ఈ స్కీమ్స్‌ను ప్రతిరోజు సగటున 27 లక్షల మంది మహిళలు వినియో గించుకుంటున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సంస్థకు చెందిన 7200 పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహాలక్ష్మి స్కీం విజయ వంతంగా అమలు చేస్తున్నామన్నారు.
పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే 1325 డీజిల్, మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెస్తుందన్నారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తుందని చెప్పారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌ను చేపడుతామన్నారు. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని.. కరీంనగర్లో అపాయిట్మెంట్ లెటర్లను మంత్రి పొన్నం అందజేస్తారన్నారు.