మీన రాశి ఫలాలు (Saturday, January 27, 2024) ఒక స్నేహితునికి మీ విసురు ర్యాష్ ప్రవర్తన వలన కొంత సమస్య కలుగుతుంది. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోబోతున్నారు. వారికి స్వచ్ఛమయిన తేజో వలయాలు ఉన్నాయి. వారు తమ అమాయకత్వం తోను, ఆహ్లాద స్వభావం తోను, వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియని వారు, తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. మీ లవర్ తో పగలు, ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు- దానికిబదులు మీరు ప్రశాంతమైన మనసుతో, ఆమెకి మీఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి. ఈరోజు మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకుంటారు.మీరు ఈసమయాన్ని మీకుటుంబసభ్యులతో గడుపుతారు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు. ఈరోజు,మీరు పెద్దసమస్యలో చిక్కుకుంటారు.జీవితంలో స్నేహితులు ఎంతముఖ్యమో మీకు తెలిసివస్తుంది. రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోనులో పొందుటకు, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి – ఆస్ట్రోసేజ్ కుండలి ఆప్ అదృష్ట సంఖ్య :- 1 అదృష్ట రంగు :- ఆరెంజ్ మరియు బంగారం చికిత్స :- ఒక మంచి ప్రేమ జీవితం కోసం, వెండి ఏనుగును మీ ప్రేమికులకు బహుమతి గా ఇవ్వండి .

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో విగ్రహం లభ్యం కాగా.. ఆ విగ్రహాన్ని గోపన్న 11వ తరం వారసుడు కంచర్ల శ్రీనివాస్‌కు అప్పగించారు.

ప్రధానాంశాలు:

  • వెలుగులోకి భక్త రామదాసు కంచర్ల గోపన్న విగ్రహం
  • నేలకొండపల్లి పోలీసు స్టేషన్ ఆవరణలో విగ్రహం
  • 11వ తరం వారసుడికి అప్పగింత
  • భద్రాచలం ఆలయాన్ని భక్త రామదాసు కంచర్ల గోపన్న నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అయితే ఆయన ఎలా ఉండేవారు.. ఆహార్యం ఏమిటనేది ఇప్పటివరకు ఓ స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఉహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు రూపొందించారు. తాజాగా.. భక్త రామదాసు కంచర్ల గోపన్న విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీసు స్టేషన్‌లో ఏళ్లుగా నిరాదరణకు గురైన విగ్రహం గోపన్నదే అని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది
నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్‌ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఆవరణలోని రావిచెట్టు వద్ద ఉన్న ఓ విగ్రహాన్ని గుర్తించారు. పది రోజుల క్రితం ఈ విగ్రహ ఆచూకీని స్థానికుడు పసుమర్తి శ్రీనివాస్‌ ద్వారా తెలుసుకున్న చరిత్రకారులు రామోజు హరగోపాల్‌, కట్టా శ్రీనివాస్‌లు పలు రకాల పరిశీలనల తర్వాత భక్త రామదాసు రూపమనే అంచనాకు వచ్చారు. అనంతరం అది రామదాసు విగ్రహామేనని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కాసెపోసి కట్టిన ధోవతి, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా.. అంజలి ముద్రతో మొన కిందికి పెట్టిన కత్తి, మీసాలు, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖతో విగ్రహం కనిపిస్తోంది. కుడి, ఎడమ భుజాలపై శంకుచక్రాలు ఉండడంతో వైష్ణవ భక్తునిగా తెలుస్తోంది.

భక్తరామదాసు విగ్రహం

ఈ విగ్రహం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్న, మాదన్నలది కాదని, వారి మేనల్లుడు భక్త రామదాసుదేనని వారు వెల్లడించారు. ఇది సుమారు 17వ శతాబ్దానికి చెందిందని వారు తెలిపారు. ఇప్పటివరకూ ఈ పరిసర ప్రాంతాల్లో రామదాసు విగ్రహాలేవీ బయటపడలేదని వివరించారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద వెలుగుచూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై చేతుల మీదుగా రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావుకు అప్పగించారు. ఆయన ఆ విగ్రహాన్ని శుద్ధిచేసి భక్త రామదాసు నివాస స్థలమైన ధ్యానమందిరానికి తీసుకెళ్లి సీతారామచంద్రుల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. భద్రాచల దేవస్థానం, పురావస్తు శాఖ అధికారులు ఈ విగ్రహాన్ని నిర్ధారించాల్సి ఉంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *