జన్ మత్ జోస్యం నిజమవుతుందా ?
తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలపై జన్ మత్ సర్వే సంస్ధ తన జోస్యాన్ని రిలిజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కంటిన్యు అవుతుందని చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి స్ధానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. ప్రతిపార్టీ దేనికదే ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నాయి. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో తక్కువలో తక్కువ 15 సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది.
అందుకు తగ్గట్లే అభ్యర్ధుల వడపోత కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలోను గ్రౌండ్ లెవల్లో సర్వేలు చేయించుకుంటున్నది. బీఆర్ఎస్, బీజేపీలు ఇంకా సర్వేలపై పూర్తిస్ధాయి దృష్టిపెట్టలేదు. అయితే జన్ మత్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 7-9 స్ధానాలు దక్కుతాయని తేలిందట. అలాగే బీఆర్ఎస్ కు 4 లేదా 5 సీట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి రెండు లేదా మూడు సీట్లు వచ్చే అవకాశముందని తేలిందట.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అన్నీ పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత ఓటర్ల ఆలోచన మారే అవకాశముంది. అంతేకాకుండా ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయముంది. కాబట్టి ఏ సర్వేసంస్ధ అయినా మళ్ళీ రెండుసార్లు సర్వేలు నిర్వహిస్తాయి. అప్పుడు రాబోయే రిజల్టు ఎలాగుంటుందనేది ఇంకాస్త కీలకంగా మారుతుంది. ఏదేమైనా జన్ మత్ రిడుదలచేసిన ఎగ్జిట్ ఫలితాల సర్వే ఆసక్తిగా మారింది.