PM Modi Visit: రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ

 PM Modi Visit: రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Modi Visit: ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఏపీతో పాటు కేరళలో పర్యటించే ప్రధాని పలు అభివృద్ధి పనులను జాతికి అంకితం చేస్తారు.

రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ

రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Modi Visit: ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16న, 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, కేరళలో పర్యటించనున్నారు. కేంద్ర భాగస్వామ్యంతో నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు మాదక ద్రవ్యాల కొత్త క్యాంపస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్ మరియు పరోక్ష పన్నులు 74వ మరియు 75వ బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్ ట్రైనీలతో పాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో కూడా ప్రధాన మంత్రి ఇంటరాక్ట్ అవుతారు.

జనవరి 16న, మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రధానమంత్రి శ్రీ సత్యసాయి జిల్లా, పాలసముద్రం చేరుకుని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు & నార్కోటిక్స్ (NACIN) కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారని పిఎంఓ ప్రకటించింది.

“500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అకాడమీ పరోక్ష పన్నులైన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ మరియు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలో సమర్థులైన సిబ్బందిని తీర్చిదిద్దుతుందని వివరించారు.

జనవరి 17వ తేదీ ఉదయం కేరళలోని గురువాయూర్ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయంలో ఉదయం 10:30 గంటలకు పూజలు చేస్తారరు. ఆ తర్వాత, మధ్యాహ్నం సమయంలో, ప్రధాన మంత్రి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల రంగానికి సంబంధించిన ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారని PMO తెలిపింది.

970 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీని కూడా జాతికి అంకితం చేస్తారు. కొచ్చిలోని పుతువైపీన్‌లో ఇండియన్ ఆయిల్ యొక్క ఎల్‌పిజి దిగుమతి టెర్మినల్ సుమారు రూ. 1,236 కోట్లతో నిర్మించినట్టు పిఎంఓ పేర్కొంది.

విస్తృత ఏర్పాట్లు….

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈనెల 16న శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు. పాలసముద్రంలోని నాసిన్ కేంద్రం వద్ద, హెలిప్యాడ్, పలు భవనాలను, వాహనాల రాకపోకల, పలు ఏర్పాట్లపై అడ్వాన్స్ సెక్యూరిటీ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు

ప్రధాని పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

16న మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం చేరుకుని అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్,ఇన్డైరక్ట్ టాక్టెస్ అండ్ నార్కోటిక్స్(NACIN)ను సందర్శిస్తారు. భవనం మొదటి అంతస్తులో గల యాంటీక్యూస్ (Antiques) స్మగ్లింగ్ స్టడీ సెంటర్ ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్ ను సందర్శిస్తారు. అదే విధంగా వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు.

అనంతరం 74,75వ బ్యాచ్ ల ఆఫీసర్ ట్రైనీలతో ఇంటరాక్ట్ అవుతారు. బహిరంగ సభలో ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. తదుపరి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరక్ట్ టాక్టెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్ ను అందిస్తారు.

ప్రధాన మంత్రి పర్యటనలో రాష్ట్ర గవర్నర్,ముఖ్యమంత్రి వర్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి కూడా తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ డా.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రత,రవాణా, వసతి,వైద్య సేవలు వంటివి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.sa

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *