Sankranti Festival : మీకు తెలుసా..? ప్రతి 72 ఏళ్లకోసారి సంక్రాంతి పండుగ తేదీలో మార్పు.!

 Sankranti Festival : మీకు తెలుసా..? ప్రతి 72 ఏళ్లకోసారి సంక్రాంతి పండుగ తేదీలో మార్పు.!

Sankranti Festival : సంక్రాంతి పండగ తేదీ మారటం గమనించారా..? అసలు ఎన్ని సంవత్సరాలకు ఈ తేదీ మారుతుందో తెలుసా…? అయితే ఈ విషయాలను తెలుసుకోండి…

సంక్రాంతి పండగ

సంక్రాంతి పండగ

Sankranti Festival Dates: సంక్రాంతి పండుగ తేదీ ప్రతి 72 ఏళ్లకోసారి మరుసటి రోజుకు మారుతూ వస్తోంది. ఆశ్చర్యం కలిగించినా ఇది నూటికి నూరుపాళ్ల నిజమని శాస్త్రం చెబుతోంది. 2008వ సంవత్సరం నుంచి సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన రావడం ప్రారంభమయింది. అంతకు ముందు 1935వ సంవత్సరం నుంచి 2007 వరకు జనవరి 14నే పండుగ వచ్చింది. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒక రోజు తర్వాతకు మారడాన్ని మనం గమనించవచ్చు. 1935 నుంచి 2007 వరకు జనవరి 14న, 2008 నుంచి 2080 వరకు జనవరి 15న,2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది.

ఎందుకిలా అంటే..

ఎందుకిలా అంటే సాధారణంగా సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించిన నాడే మకర సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు నుంచి మిధునరాశిలోకి ప్రవేశించే దాకా ‘ఉత్తరాయణ పుణ్య కాలం’ గా వ్యవహరిస్తారు. ఇక సూర్యుడు ప్రతీ సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూల గణన ఆధారంగా ఇది మూడు సంవత్సరాలకు ఒక గంట 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది. ఈ లెక్కన ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం 72 ఏళ్లకొకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. జనవరి 15వ తేదీన పండుగ రావడం 2008 నుంచి మనం చూస్తున్నాం. అయితే జనవరి16న సంక్రాంతి పండుగ రావడాన్ని ఎలాగూ మనం చూసే అవకాశం లేదండోయ్.!

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *