Kesineni Nani Resign : ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా..! కేశినేని నాని కీలక ప్రకటన

 Kesineni Nani Resign : ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా..! కేశినేని నాని కీలక ప్రకటన

Kesineni Nani Latest News: కేశినేని నాని కీలక ప్రకటన చేశారు. ఎంపీ పదవితో పాటు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని అందిస్తానని పేర్కొన్నారు.

Kesineni Nani Latest News: విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ కు రాజీనామాను అందజేస్తానని వెల్లడించారు. ఆ తర్వాత వెంటనే పార్టీకి కూడా రాజీనామా ఇస్తానని పేర్కొన్నారు.

“చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలిసి నా లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను”అని కేశినేని నాని సామాజిక మాధ్యామం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.

తిరువూరు సభ విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య మొదలైన వార్.. చివరికి నాని బయటికెళ్లే పరిస్థితి వరకు వచ్చింది. ఇదే సమయంలో విజయవాడ పార్లమెంటు బాధ్యతల నుంచి కేశినేని నానిని తప్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేసిన కేశినేని నాని…. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగాలా వద్దా అనేది తన అభిమానులు, కార్యకర్తలు నిర్ణయిస్తారని… అయినా తినబోతూ రుచులెందుకు..? అని కామెంట్స్ చేశారు. ఇక తనను తిరువూరు సభకు రావొద్దని చెప్పారని వెల్లడించారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని… అలా చేస్తే ఇంకా పెద్ద పదవిలో ఉండేవాడినని అన్నారు కేశినేని నాని. పదేళ్లుగా విజయవాడకు ఎంతో అభివృద్ధి చేశానని… అటువంటి తాను ఖాళీగా ఉంటే అభిమానులు కార్యకర్తలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. మూడోసారి గెలవటం పక్కా అని చెప్పుకొచ్చారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *