TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో 78 పర్మనెంట్‌ ఉద్యోగాలు.. రూ.1,51,370 వరకూ జీతం

 TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో 78 పర్మనెంట్‌ ఉద్యోగాలు.. రూ.1,51,370 వరకూ జీతం

Tirumala Tirupati Devasthanam : టీటీటీ ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. వివరాల్లోకెళ్తే..

ప్రధానాంశాలు:

  • టీటీడీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2024
  • డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ
  • 2024 ఫిబ్రవరి 29 దరఖాస్తులకు చివరితేది
టీటీడీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2024
TTD – Tirumala Tirupati Devasthanam : ఆంధ్రప్రదేశ్‌ – తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).. శాశ్వత ప్రాతిపదికన TTD డిగ్రీ కాలేజీలు/ ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు.. అలాగే TTD జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో మొత్తం 78 పోస్టులున్నాయి.

వీటిలో కూడా డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు- 49, జూనియర్‌ లెక్చరర్‌-29 పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

మొత్తం పోస్టులు – 78
డిగ్రీ లెక్చరర్: 49 పోస్టులు

  • సబ్జెక్టుల వారీ ఖాళీలు: బోటనీ- 3, కెమిస్ట్రీ- 2, కామర్స్- 9, డెయిరీ సైన్స్- 1, ఎలక్ట్రానిక్స్- 1, ఇంగ్లిష్- 8, హిందీ- 2, హిస్టరీ- 1, హోమ్ సైన్స్- 4, ఫిజికల్ ఎడ్యుకేషన్- 2, ఫిజిక్స్- 2, పాపులేషన్ స్టడీస్- 1, సంస్కృతం- 1, సంస్కృత వ్యాకరణం- 1, స్టాటిస్టిక్స్- 4, తెలుగు- 3, జువాలజీ- 4 పోస్టులున్నాయి.
  • అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించి ఉండాలి.
జూనియర్ లెక్చరర్: 29 పోస్టులు
  • సబ్జెక్టుల వారీ ఖాళీలు: బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్‌- 4, కామర్స్‌- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్‌- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2 పోస్టులున్నాయి.
  • అర్హత: కనీసం 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్య సమాచారం :

  • వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01-07-2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
  • జీత భత్యాలు: నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960- రూ.1,51,370.. జూనియర్ లెక్చరర్‌కు రూ.57,100- రూ.1,47,760 ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.370గా నిర్ణయించారు.
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2024, ఫిబ్రవరి మొదటి వారంలో దరఖాస్తుల ప్రారంభమవుతుంది.
  • దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 29, 2024
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.tirumala.org/
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *