హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు.. చివరి ట్రైన్ ఎప్పుడంటే..?
Numaish Exhibition: హైదరాబాద్ నగరంలో నిర్వహించే నూమాయిష్ ఎగ్జిబిషన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ ఎగ్జిబిషన్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు రానుండగా.. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. సందర్శకుల రవాణా సౌకర్యం కోసం హైదరాబాద్ మెట్రో రైళ్ల పని వేళలు పొడిగించింది. ఎగ్జిబిషన్ టైమింగ్స్‌ను దృష్టిలో పెట్టుకుని రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడిపించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
Numaish Timings: హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్స్‌లో ఈరోజు (జనవరి 1) నుంచి 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్- 2024) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ ఎగ్జిబిషన్‌కు నగరం నలువైపులా నుంచి సందర్శకులు తరలిరానున్నారు. కాగా.. సందర్శకుల తాకిడిని దృష్టిలో పెట్టుకున్న ఎప్పటిలాగే.. హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సందర్శకుల కోసం మెట్రో రైళ్ల వేళలను అర్ధరాత్రి ఒంటి గంట వరకు పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. దీంతో మియాపూర్ – ఎల్బీనగర్, నాగోల్- రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైలు రాత్రి 12.15 గంటలకు మొదలై 1 గంటల వరకు గమ్యస్థానానికి చేరుకోనుంది. మెట్రో స్టేషన్లలో నుమాయిష్ సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను కోసం టీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. ఈ ఎగ్జిబిషన్‌ను సుమారు 22 లక్షలాది మంది సందర్శించనున్నట్టు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ టైమింగ్స్.. వారాంతపు రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు కాగా.. వీకెండ్స్, సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శించే అవకాశం కల్పించారు. అయితే.. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు వాహనాలతో లోపలికి వెళ్లి సందర్శించే అవకాశం కూడా కల్పించారు. అయితే.. ఇందుకోసం ప్రత్యేక రుసుముగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.