IOCL : ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో 1,603 జాబ్స్.. డిగ్రీ, ఐటీఐ పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోండి

 IOCL : ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో 1,603 జాబ్స్.. డిగ్రీ, ఐటీఐ పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోండి

Indian Oil Corporation : ఐఓసీఎల్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ.. భారీ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 1603 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

ప్రధానాంశాలు:

  • ఐఓసీఎల్‌ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌
  • 1603 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన
  • 2024 జనవరి 5 దరఖాస్తులకు చివరితేది
  • ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌
    IOCL Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1603 అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2024, జనవరి 5 దరఖాస్తులకు చివరితేది.

    ముఖ్య సమాచారం :

    • ట్రేడులు: టెక్నీషియన్ అప్రెంటిస్- మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్
    • ట్రేడ్ అప్రెంటిస్(టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్)- ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్
    • వయోపరిమితి : 2023 నవంబర్ 30 నాటికి అభ్యర్థులు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులతో పాటు దివ్యాంగులకు కొన్ని వయోపరిమితి సడలింపు ఉంటుంది.
    • విద్యార్హతలు : బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో సాంకేతిక నైపుణ్యం, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్ యాప్టిట్యూడ్ సహా రీజనింగ్ ప్రశ్నలు పరిష్కరించే సామర్థ్యం, బేసిక్ ఇంగ్లిష్ తెలిసి ఉండాలి. అలాగే.. ఆన్లైన్ టెస్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 35 శాతం మార్కులు స్కోర్ చేస్తే సరిపోతుంది.
    • ఎంపిక ప్రక్రియ : డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఆన్లైన్ టెస్టులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

    ముఖ్యమైన తేదీలు

    • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : డిసెంబర్ 16, 2023
    • దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 5, 2024
    • అధికారిక వెబ్సైట్ : వయోపరిమితి సడలింపులు సహా నోటిఫికేషన్కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/ చూడవచ్చు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలను మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపుతారు.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *