RGV Complaint : తల తెస్తే రూ.కోటి ఇస్తా- ప్రాణహాని ఉందని డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు
RGV Complaint : ఆర్జీవీ తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానని ఓ టీవీ చర్చా కార్యక్రమంలో టీడీపీ మద్దతుదారు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఈ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని, తనకు ప్రాణహాని ఉందని ఆర్జీవీ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
RGV Complaint : ఆర్జీవీ తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానని ఓ టీవీ చర్చా కార్యక్రమంలో టీడీపీ మద్దతుదారు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఈ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని, తనకు ప్రాణహాని ఉందని ఆర్జీవీ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు
ఈ వ్యాఖ్యలపై ఆర్జీవీ సామాజిక మాధ్యమాల్లో తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపించేందుకు కాంట్రాక్ట్ ఇచ్చారని, ఓ న్యూస్ ఛానల్ యాంకర్ ఆయనకు సాయం చేస్తున్నారని ఆరోపించారు. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తో కలిసి ఆర్జీవీ…విజయవాడలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు లైవ్ టీవీలో నన్ను చంపి నా తలను తీసుకువచ్చినవాడికి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ ఇచ్చారని లిఖిత పూర్వత ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా నన్ను నా ఇంటికొచ్చి తగలబెడతానని కూడా పబ్లిక్ గా అదే టీవీలో చెప్పారని ఆర్జీవీ ఆరోపించారు. దీన్ని బట్టి వాళ్లిద్దరూ నన్ను చంపటానికి కాంట్రాక్ట్ ఇవ్వటానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్ గా అర్థమవుతోందని ఆర్జీవీ ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో హత్యా కాంట్రాక్టులు ఇంత పబ్లిక్ గా ఇవ్వటం చూస్తే టెర్రరిస్టులు కూడా షాక్ అవుతారన్నారు. న్యూస్ ఛానల్ లో చర్చా కార్యక్రమం పెట్టిన యాంకర్, ఆ న్యూస్ ఛానల్ యజమాని, కొలకపూడి శ్రీనివాసరావుపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జీవీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ టీడీపీ మద్దతుదారు కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ లైవ్ లో పదే పదే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేగింది. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసి ఆర్జీవీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం వ్యూహం… నవంబర్ 10న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే వ్యూహం మూవీ విడుదలకు సెన్సార్ బోర్డు ఇవ్వలేదు. అనంతరం రివ్యూ కమిటీ వెళ్లగా…సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. దీంతో వ్యూహం సినిమాను డిసెంబర్ 29న విడుదల చేస్తానని ప్రకటించారు. ఈ సినిమాను ఆర్జీవీ సీఎం జగన్ రాజకీయ జీవితం ఆధారంగా తీశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, చిరంజీవి, సోనియా గాంధీ పాత్రలను దురుద్దేశపూర్వకంగా చూపించారని ఆ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మ ఆఫీసుల ముందు నిరసనలు కూడా చేశారు. ఇదిలా ఉంటే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.