నేటి నుంచి ‘ప్రజాపాలన’ దరఖాస్తులు.. కావాల్సిన పత్రాలు ఇవే.. ఎలా నింపాలంటే..?
నేటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఐదు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి ఈ అఫ్లికేషన్లు స్వీకరిస్తున్నారు. నేటి నుంచి జనవర్ 6 వరకు జరిగే ఈ స్పెషల్ డ్రైవ్‌లో అర్హులు ప్రభుత్వ పథకాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే అందుకు సంబంధించిన పత్రాలు, ఎలా నింపాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధానాంశాలు:
- నేటి నుంచి ‘ప్రజాపాలన’ దరఖాస్తులు
- ఐదు గ్యారంటీలకు దరఖాస్తులు ఆహ్వానం
- ఒకే అఫ్లికేషన్, కావాల్సిన పత్రాలు ఇవే..
- గ్రెస్ ప్రభుత్వం ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ‘ప్రజాపాలన దరఖాస్తు’ ఫారాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేసారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత.. అయిదు పథకాల వివరాలు ఈ ఫారంలో ఉన్నాయి. ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా.. ఏ పథకానికి అర్హులైనవారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. అన్ని పథకాలకూ అర్హులైనా.. ఒకే దరఖాస్తులోని ఆయా వివరాలు నింపితే సరిపోతుంది. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, దరఖాస్తుదారు ఫొటో ఇవ్వా్ల్సి ఉంటుంది.
మెుత్తం నాలుగు పేజీల దరఖాస్తు ఫారంలో తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య, రేషన్‌కార్డు సంఖ్య, మొబైల్ ఫోన్ నంబరు, వృత్తితో పాటు సామాజికవర్గం వివరాలను నింపాలి. ఇందులో దరఖాస్తుదారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు.. ఏ విభాగంలోకి వస్తే అక్కడ టిక్ మార్కు పెట్టాలి. కింద కుటుంబసభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్ నంబర్లు రాయాలి. తర్వాత దరఖాస్తుదారు చిరునామా నింపాల్సి ఉటుంది.
కుటుంబ వివరాల తర్వాత.. అయిదు పథకాలకు సంబంధించిన వివరాలున్నాయి. ఏ పథకానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే ఆ పథకం దగ్గర టిక్ మార్కు చేయాలి. అలాగే అందులో అడిగిన వివరాలు నింపాల్సి ఉంటుంది.