AP AHA Hall Ticket 2023: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 ఉద్యోగాలు.. హాల్‌టికెట్లు విడుదల Authored By కిషోర్‌ రెడ్డి | Samayam Telugu | Updated: 27 Dec 2023, 1:14 pm

 AP AHA Hall Ticket 2023: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 ఉద్యోగాలు.. హాల్‌టికెట్లు విడుదల Authored By కిషోర్‌ రెడ్డి | Samayam Telugu | Updated: 27 Dec 2023, 1:14 pm

AP AHD AHA Hall Ticket 2023 : ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధక శాఖలో యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి డిసెంబరు 31వ తేదీన నియామక పరీక్ష నిర్వహించనున్నారు.

AP AHD AHA Hall Ticket 2023 : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ చెబుతున్న విషయం తెలిసిందే. పశుసంవర్థక శాఖలో 1896 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సచివాలయాలకు అనుబంధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రా (YSRRBK)ల్లో పశు సంవర్థక సహాయకులు (Animal Husbandry Assistant) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. నవంబర్‌ 20వ తేదీ నుంచి డిసెంబర్‌ 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ముగిసింది.

AP AHD AHA Hall Ticket 2023 డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

డిసెంబర్ 27న హాల్‌టికెట్లు విడుదల.. 31న రాత పరీక్ష:
అయితే.. ఈ 1896 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ 27వ తేదీన రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్ 31వ తేదీన ఆన్ లైన్ ద్వారా రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు జనవరిలో జాయినింగ్ లెటర్స్ అందజేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదట రెండేళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ సమయంలో రూ.15,000 చొప్పున చెల్లిస్తారు. అనంతరం నెలకు రూ.22,460 జీతం ఉంటుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్లు విడుదలయ్యాక https://apaha-recruitment.aptonline.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *