TREIRB Results: టీఎస్‌ గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి లైన్‌క్లియ‌ర్‌.. ఈనెల 28, 29 తేదీల్లో..

 TREIRB Results: టీఎస్‌ గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి లైన్‌క్లియ‌ర్‌.. ఈనెల 28, 29 తేదీల్లో..

TREIRB Telangana Teacher Results 2023 : తెలంగాణలో గురుకుల ఉద్యోగ నియామక ప్రక్రియలో కొంత కదలిక కనిపిస్తోంది. టీఆర్‌ఈఐఆర్‌బీ త్వరలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

TREIRB Gurukulam Results 2023 : తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొంత కదలిక వచ్చింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREIRB).. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు వేసింది . 9210 ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలను నిర్వహించిన.. TREIRB మూడు కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షల తాలుకూ ప్రశ్నాపత్రాల ‘కీ’ లను సైతం విడుదల చేసింది.

అయితే.. మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే TREIRB బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలనను అత్యంత జాగ్రత్తగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించింది.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *