APPSC : ఏపీ ప్రభుత్వం మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1,47,760 వరకూ జీతం

 APPSC : ఏపీ ప్రభుత్వం మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1,47,760 వరకూ జీతం

APPSC Jobs : ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

ప్రధానాంశాలు:

  • ఏపీ పీసీబీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2023
  • 21 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • జనవరి 30వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం
  •  Pollution Control Board – Assistant Environmental Engineer : ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (AP Pollution Control Board)లో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ (Assistant Environmental Engineer) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక.. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష 2024, ఏప్రిల్‌/మే నెలలో జరిగే అవకాశం ఉంది.
    ముఖ్య సమాచారం :

    • అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్: 21 పోస్టులు
    • అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్/ మెకానికల్/ కెమికల్/ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
    • జీత భత్యాలు: నెలకు రూ.57,100 – 1,47,760గా ఉంటుంది.
    • వయస్సు: అభ్యర్థుల వయసు 01.07.2023 నాటికి 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి.
    • దరఖాస్తు ఫీజు: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు.
    • ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
    • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
    • ముఖ్య తేదీలు:

      • దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం : జనవరి 30, 2024
      • దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 19, 2024
      • రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.
      • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *