TS Covid Updates: తెలంగాణలో కోవిడ్ అలర్ట్‌… ఆరు కొత్త కేసులు నమోదు

 TS Covid Updates: తెలంగాణలో కోవిడ్ అలర్ట్‌… ఆరు కొత్త కేసులు నమోదు

TS Covid Updates: తెలంగాణలో కోవిడ్ కలకలం రేపుతోంది. బుధవారం ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి.

TS Covid Updates: దేశ వ్యాప్తంగా అలజడి రేపుతున్న కోవిడ్‌ తెలంగాణలో కూడా వెలుగు చూసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 06 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. మరో 42 మందికి సంబంధించిన రిపోర్ట్స్ వెలువడాల్సి ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 14 మంది కొవిడ్‌ చికిత్సలు పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశంలో బుధవారం ఒక్కరోజే 614 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 3 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర గణంకాలు వెల్లడించాయి.

తెలంగాణలో కోవిడ్ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే చికిత్స పొందుతన్న వారిలో ఒకరు పూర్తిగా కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ చావులు నమోదు కాలేదు. కోవిడ్ కేసుల్లో రికవరీ రేటు 99.51శాతంగా ఉన్నట్టు ప్రకటించారు.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఇప్పటి వరకు జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు 21 నమోదయ్యాయి. ఒక్క గోవాలోనే 14 మంది కోవిడ్ బారిన పడ్డారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూశాయి.

తెలంగాణలో ఇప్పటి వరకూ 14 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నట్లు వైద్యశాఖ ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే కొత్తగా మరో ఆరు కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఈ కేసులన్నీ హైదరాబాద్ పరిదిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *