Remand For Pallavi prasanth: పల్లవి ప్రశాంత్‌కు 14రోజుల రిమాండ్‌..చంచల్‌ గూడకు తరలింపు

 Remand For Pallavi prasanth: పల్లవి ప్రశాంత్‌కు 14రోజుల రిమాండ్‌..చంచల్‌ గూడకు తరలింపు

Remand For Pallavi prasanth: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టైన బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది.

Remand For Pallavi prasanth: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్‌లను బుధవారం సాయంత్రం గజ్వేల్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తరలించిన తర్వాత ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన పోలీసులు బుధవారం గజ్వేల్‌లో పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేశారు.

రాత్రి పొద్దుపోయిన తర్వాత న్యాయమూర్తి నివాసంలో పల్లవి ప్రశాంత్‌తో పాటు అతడి సోదరుడిని హాజరుపరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించింది. పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు రామరాజులను పోలీసులు చంచల్‌ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో దాడులకు పాల్పడిన మరికొందరిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. సిసిటీవీ ఫుటేజీలు, వీడియోల ఆధారంగా నిందితుల్ని గుర్తిస్తున్నారు. అల్లర్ల సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న మొబైల్ డంప్‌ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

గత ఆదివారం రాత్రి బిగ్‌ బాస్ సీజన్ 7లో విజేతల్ని ప్రకటించిన తర్వాత పోలీసులు వారిస్తున్నా వినకుండా ర్యాలీ నిర్వహించడం, ఇతరుల వాహనాలపై దాడికి పాల్పడటం, ఆర్టీసీ బస్సుల అద్దాలు పగులగొట్టడం, పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వడం వంటి ఘటనలపై కేసులు నమోదు చేశారు. ఈ విధ్వంసానికి బాధ్యుడిగా పల్లవి ప్రశాంత్‌పై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. న్యాయస‌్థానం ఆదేశాలతో జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *