Telangana Assembly Live News : ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం – కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం
Telangana Assembly Sessions Live Updates : కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం సీఎంతో పాటు కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి….
బందోబస్తు
మరోవైపు కొత్త అసెంబ్లీ కొలువుదీరనున్న నేపథ్యంలో… అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతపరమైన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. ఏర్పాట్లపై సీఎస్ తో పాటు డీజీపీ పర్యవేక్షించారు.
రాజాసింగ్ ప్రకటన
గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్గా వ్యవహరిస్తే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని స్పష్టం చేశారు.
స్పీకర్ పదవికి నోటిఫికేషన్
స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పదవి కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ను ఖరారు చేసింది కాంగ్రెస్. నోటిఫికేషన్ విడుదలైన అయిన తర్వాత… సభ్యులు ఆయన్ను స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి.
Sat, 09 Dec 202309:12 AM IST
11 గంటలకు సభ
ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై బీఏసీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తొలిరోజు మాత్రం సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. తిరిగి సమావేశాలు ఈనెల 13 నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు.
at, 09 Dec 202309:09 AM IST
బీఆర్ఎస్ఎల్పీ భేటీ…
ఈరోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. ఈ సమావేశంలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు.
Sat, 09 Dec 202309:09 AM IST
బలబలాలు…
119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు 7 మంది సభ్యుల బలం ఉంది.
Sat, 09 Dec 202309:03 AM IST
51 మంది తొలిసారి…
ఈసారి 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు.
Sat, 09 Dec 202309:02 AM IST
ఉదయం 11 గంటలకు
ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో నేడు ప్రమాణం చేయించనున్నారు ప్రోటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ.
Sat, 09 Dec 202309:01 AM IST
హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ప్రొటెం స్పీకర్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్,పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అక్బరుద్దీన్ ఒవైసీ తో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు.
Sat, 09 Dec 202309:00 AM IST
Telangana Assembly Live News :ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ
ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేశారు. కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కానుంది.