East Godavari Rains : వర్షాలు తగ్గే వరకు ఖరీఫ్ కోతలు వద్దు, మరో 48 గంటలు భారీ వర్షాలు- కలెక్టర్ మాధవీలత
East Godavari Rains : తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గే వరకు ఖరీఫ్ కోతలు చేపట్టవద్దని కలెక్టర్ మాధవీలత రైతులను విజ్ఞప్తి చేశారు
East Godavari Rains : మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో తుపాను ప్రభావం వర్షాలు పడుతున్నాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత అధికారులను అలర్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాలు తగ్గే వరకు ఖరీఫ్ కోతలు చేపట్టవద్దని కలెక్టర్ రైతులను కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచనలు పాటించాలని రైతులను విజ్ఞప్తి చేశారు. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో రానున్న 48 గంటల పాటు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు కలెక్టర్. ఇవాళ కళాశాలలకు పాఠశాలకు సెలవు ప్రకటించామని, రేపటి పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల, రైతుల సహాయం కోసం కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామన్నారు
కంట్రోల్ రూమ్ నెంబర్లు
- కలెక్టరేట్, బొమ్మూరు -8977935609
- ఆర్డీవో రాజమండ్రి -0883-2442344
- ఆర్డీవో కొవ్వూరు -08813231488