Michaung Cycole Live news Updates: ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం

 Michaung Cycole Live news Updates: ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం

Michaung Cycole Live news Updates: మిచాంగ్ తుఫాను ప్రభావంతో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు భారీ వర‌్షాలు కురుస్తున్నాయి.

తీవ్ర తుఫాన్‍తో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

తుఫాను నేపథ్యంలో ఏపీలోని ఎనిమిది జిల్లాల్లో 181 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 308 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయ చర్యల కోసం ఐదు NDRF, ఆరు SDRF బృందాలు సిద్ధంగా ఉంచారు. నెల్లూరు, బాపట్ల, కృష్ణా, తిరుపతి, ప్రకాశంలో సహాయక బృందాలను ప్రభుత్వం మొహరించారు. ఖరీఫ్ పంటల సంరక్షణకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే లక్ష టన్నుల బియ్యం సేకరించారు. అత్యవసర ఖర్చులకు జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించారు. నష్టపోయిన కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. తుఫాన్ ప్రభావిత ఎనిమిది జిల్లాలకు సీనియర్ IASల నియామించారు. భోజనం, వసతి, వైద్యంపై దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. శిబిరాల నుంచి ఇంటికి వెళ్లే వారికి 25 కిలోల బియ్యంతో పాటు వంట సామాగ్రి ఇవ్వాలని ఆదేశించారు. ఇల్లు కూలిన వారికి తక్షణ సాయంగా రూ.10 వేలు అందించనున్నారు. 192 పునరావాస కేంద్రాలకు 7,361 మంది తరలించారు.

మధ్యాహ్నానికి తీరం దాటనున్న తుఫాను

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా మిచౌంగ్ తీరం వైపు కదులుతోంది. ప్రస్తుతానికి నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్నంలోపు బాపట్ల దగ్గరలో తీవ్రతుఫానుగా తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి.

ధాన్యం తడవకుండా చర్యలు

కల్లాల్లో ధాన్యం తడిసిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. తేమలాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించాలని కలెక్టర్లకు సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం పట్టించుకోవద్దని, ధాన్యం సేకరించి వెంటనే మిల్లుకు తరలించాలని ఆదేశించారు.

ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

మిచాంగ్ తుపాను ప్రభావంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. అప్రమత్తంగా వ్యవహరించాలని విశాఖ నుంచి నెల్లూరు జిల్లా వరకూ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల, కృష్ణా, ఏలూరు, భీమవరం, కాకినాడ జిల్లాల్లో పునరావాసం కోసం జిల్లాకు రూ.కోటి లు చొప్పున విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయటమే కాదు, బాధితులను తుపాను పునరవాస కేంద్రాలకు తరలించే ఏర్సాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సహాయక శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండిఆహారం,తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టండితుపానుతో దెబ్బతినే వ్యవస్థలను యుద్ధప్రాతిపదికనపునరుద్ధరించాలని ఆదేశించారు.

తెలంగాణలో తుఫాన్ ప్రభావం

మిచౌంగ్‌ తుఫాను అర్ధరాత్రి దాటిన తర్వాత నెల్లూరు దాటి, కావలి దగ్గర ఉంది. ప్రస్తుతం ఒంగోలులో, తరువాత ఖమ్మం, సూర్యాపేటలోకి మారుతుంది. దీని ప్రభావంతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి, వరంగల్, యాదాద్రి, జనగాంలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన తెలంగాణాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

చెన్నై జలదిగ్బంధం..

భారీ వర్షాలతో చెన్నై జలదిగ్బంధమైంది. వీధులు నదుల్లా మారిపోయాయి. – పదిమందికిపైగా దుర్మరణం పాలయ్యారు. వందలాది గృహాలు నీటమునిగాయి. కూలిన వృక్షాలతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. తుఫాన్ ప్రభావంపై సీఎం స్టాలిన్‍కు అమిత్‍షా ఫోన్ చేశారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఏపీలో కంట్రోల్ రూమ్‍లు ఏర్పాటు

తుఫాన్ నేపథ్యంలో ఏపీలో కంట్రోల్ రూమ్‍లు ఏర్పాటు చేశారు. కృష్ణా కలెక్టరేట్ నెంబర్లు : 08672-252572, 252000 – విజయవాడ కంట్రోల్ రూమ్ నెంబర్లు: 0866-2422515, టోల్ ఫ్రీ : 18004252000, వాట్సాప్ : 8181960909 – ప్రకాశం కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, కాకినాడ కలెక్టరేట్ టోల్‍ఫ్రీ నెంబర్ 1800-4253077 – కాకినాడ ఆర్డీవో కార్యాలయం నెంబర్ 9701579666 – పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం నెంబర్ 9949393805

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *