Cyclone Michaung: దక్షిణ కోస్తాకు పొంచి ఉన్న మిచౌంగ్ తుఫాను ముప్పు

 Cyclone Michaung: దక్షిణ కోస్తాకు పొంచి ఉన్న మిచౌంగ్ తుఫాను ముప్పు

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Cyclone Michaung: ఐఎండి అంచనాల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని మిచౌంగ్ తుఫాను వాయువ్య దిశగా కదులుతుందని ఇది ఆదివారం రాత్రి 8 గంటల నాటికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 330 కి.మీ, బాపట్లకు 440 కి.మీ, మచిలీపట్నానికి 450 కి.మీ. దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడి సోమవారం ఉదయానికి దక్షిణ కోస్తా మరియు ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంకు చేరుకుంది.

ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉదయం నుంచి దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తూ మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటిన తరువాత క్రమంగా బలహీన పడనుంది.

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడనున్నాయి. బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. సోమవారం తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, రేపు సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు వీస్తాయన్నారు, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

ఏపీలో తుఫాను ప్రబావంపై రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నుండి వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నారు.

విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు ప్రకటించారు. తుఫాను ప్రభావం చూపే లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు, సహాయక శిబిరాలకు తరలించడానికి జిల్లాయంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు.

సహాయక చర్యలకోసం 4 ఎన్డీఆర్ఎఫ్ , 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే చేరయన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు తుఫాన్ హెచ్చరిక మేసేజ్లు పంపిస్తున్నామని చెప్పారు. ప్రజలు అత్యవసర సహయం, సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *