Nizamabad Rains : అంధకారంలో నిజామాబాద్-నగరాన్ని ముంచెత్తిన వడగండ్ల వర్షం
Nizamabad Rains : నిజామాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ప్రధాన రహదారుల్లో చెట్లు కూలడంతో వాహనరాకపోకలకు అంతరాయం కలిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Nizamabad Rains : నిజామాబాద్ నగరాన్ని వడగండ్ల వర్షం ముంచెత్తింది. వడగండ్ల వానకు తీవ్ర గాలి దుమారం తోడవడంతో నగరం అల్లకల్లోలంగా మారింది. 15 నిమిషాల్లో నగరం బురదమయంగా మారింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు నేలకూలడంతో హెటెన్షన్ వైర్లు సైతం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ అంధకారంగా మారింది. విద్యుత్తు పునరుద్ధరించేందుకు సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఇండ్లలోకి మురికి నీరు, మరోవైపు అంధకారంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.