Ycp Mlc Marriage: ఎమ్మెల్సీ మూడో పెళ్లికి రెండో భార్య సాక్ష్యం
Ycp Mlc Marriage: కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ మూడో పెళ్లికి ఆయన రెండో భార్య సాక్షిగా నిలిచారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన జయమంగళ కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.
Ycp Mlc Marriage: మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. కొల్లేరు ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న వెంకటరమణ మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విభేదాలు తలెత్తడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. రెండో భార్య సమక్షంలోనే ఎమ్మెల్సీ మూ డో పెళ్లి చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సోమవారం రిజిస్ట్రార్ ఆఫీసులో జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. అటవీశాఖ ఏలూరు రేంజ్ సెక్షన్ ఆఫీసర్ సుజాతను ఏలూరు జిల్లా కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు.
వీరి పెళ్లికి ఎమ్మెల్సీ రెండో భార్య సునీత సాక్షి సంతకం చేశారు.వెంకట రమణకు గతంలో రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా. ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. తరవాత కైకలూరు ప్రాంతానికి చెందిన సునీతను రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సునీత విజయవాడలో ఉంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి జయ మంగళ ఇంటికి వచ్చి వెళ్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా జయ మంగళ రెండో భార్య ఆయనపై కేసులు పెట్టారు. వివాదాలతో 2019లో మచిలీపట్నం కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.
రెండో భార్య, పిల్లల అంగీకారంతోనే జయమంగళ మూడో వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం వివాహం చేసుకున్న సుజాతకు ఇది రెండో వివాహం జరిగింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు. ఏలూరు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సుజాతను మూడు నెలల కిందట పెద్దల సమక్షంలో దండలు మార్చుకుని మూడో వివాహం చేసుకున్నారు.
సోమవారం రెండో భార్య సునీత, కుమారుడు తేజ సమక్షంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడో పెళ్లిని రిజిస్టర్ చేసుకుని, ధ్రువపత్రం తీసుకున్నారు.