Coconut Husk Benefits : కొబ్బరి పీచుతో చాలా ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలిస్తే అస్సలు పడేయరు

 Coconut Husk Benefits : కొబ్బరి పీచుతో చాలా ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలిస్తే అస్సలు పడేయరు

Coconut Husk Benefits In Telugu : కొబ్బరితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొబ్బరి పీచును మాత్రం చాలా తేలికగా పడేస్తుంటారు. కానీ దీనితోనూ అనేక ఉపయోగాలు ఉన్నాయి.

కొబ్బరి ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కావు. కొబ్బరి ఇటు లోపలి ఆరోగ్యానికి, బయటి చర్మానికి చాలా ఉపయోగకరం. జుట్టుకు కూడా కొబ్బరి నూనె చాలా మంచిది. చాలామంది మాత్రం.. కొబ్బరి పీచును తీసి పడేస్తారు. దీంతో ఏం ఉపయోగం అనుకుంటారు. మరికొందరు దీనిని పొయ్యి కింద మంట పెట్టేందుకు వాడుతుంటారు. కానీ దీనిలోనూ ఆరోగ్యానికి మంచి చేసే గుణాలు ఉన్నాయి.

కొబ్బరి మాత్రమే కాదు, కొబ్బరి పీచు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఇళ్లలో కొబ్బరికాయను వంటకు ఉపయోగిస్తారు. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కొబ్బరి గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే కొబ్బరికాయను తీసుకుని అందరూ దాని పొట్టును పారవేస్తారు. ఎందుకంటే ఇది పనికిరానిదిగా పరిగణిస్తారు. కొబ్బరి పీచును విసిరేయకూడదు. ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.

మనం ఎక్కువగా కొబ్బరి నూనెను గాయాలపై ఉపయోగిస్తుంటాం. అలాగే గాయం తర్వాత వాపు ఉన్న ప్రదేశంలో కొబ్బరి నూనెను కూడా రాసుకోవచ్చు. కొబ్బరి పీచు పొడిని పసుపుతో కలిపి మంట ఉన్న చోట రాస్తే మంట తగ్గుతుంది.

కొబ్బరి పీచు పసుపు దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. కొబ్బరి పొట్టును కాల్చి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో సోడా మిక్స్ చేసి దంతాల మీద తేలికగా రుద్దండి. దంతాలు తెల్లగా మారుతాయి.

కొబ్బరి పీచుతో తెల్లజుట్టు కూడా నల్లబడుతుంది. బాణలిలో కొబ్బరి పీచును వేడి చేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిని కొబ్బరినూనెలో కలిపి పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని హెయిర్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. కొబ్బరి పీచు పొడిని నూనెలో కలిపి తలకు పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు నల్లగా మారుతుంది.

గ్యాస్ మీద నీటిని మరిగించండి. అందులో కాస్త తేనె కలపాలి. తర్వాత కొబ్బరి పీచులో ఈ నీటిని తీసుకుని మోచేతులు, పాదాలపై కొద్దిగా స్క్రబ్ చేయండి. కేవలం తేలికగా చేయండి. మన చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి చాలా వేగంగా చేయెుద్దు. ఇలా చేస్తే డార్క్ స్కిన్ తొలగిపోతుంది.

కొబ్బరి పీచు పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కొబ్బరి పీచును కాల్చి మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్లతో కలిపి తాగితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *