Coconut Water: కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఏ ప్రయోజనం?

 Coconut Water: కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఏ ప్రయోజనం?

Coconut Water: కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అయితే వీటిని ఏ సమయంలో తాగితే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఒకసారి తెలుసుకోండి.

కొబ్బరి నీళ్లు (freepik)

ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా, నీరసంగా అనిపించినా, వేడి చేసినట్లుగా ఉన్నా.. అందరికీ ఠక్కున గుర్తొచ్చేవి కొబ్బరి నీళ్లు. లేత కొబ్బరి బొండాంలో నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చక్కెరలు ఎక్కువగా వేసి చేసే శీతల పానీయాలను చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. అవి తాగాలని అనిపించినప్పుడల్లా ఓ కొబ్బరి బొండాం తాగడం అలవాటుగా చేసుకోండి. ఇది మీ ఆరోగ్యంపై ఎన్నో సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. మరి ఈ నీటిని అసలు ఏ సమయంలో తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో నిపుణులు తెలుపుతున్నారు. ఆ విశేషాలేంటో చదివేద్దాం రండి.

కొబ్బరి నీళ్లు తాగేందుకు సరైన సమయం:

  • కొబ్బరి నీళ్లను ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల చలవ చేస్తుంది. ఎక్కువగా వేడి చేసినట్లు ఉన్నట్లయితే ఇలా పొద్దున్నే తాగడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి స్వాంతన లభిస్తుంది.
  • అలాగే ఈ నీటిలో కేలరీలు తక్కువ. తేలికగా జీర్ణం అవుతాయి. భోజనం చేసిన కాసేపటి తర్వాత వీటిని తాగినట్లైతే తిన్న ఆహారం మెరుగ్గా జీర్ణం అవుతుంది. అందుకు ఈ నీరు సహకరిస్తుంది. పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
  • నిద్ర పోయే ముందు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మానసికంగా మనం మెరుగ్గా ఉంటాం. ఆందోళన, ఒత్తిడి లాంటివి తగ్గుతాయి. మెదడు ప్రశాంతంగా మారుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా మూత్ర నాళంలో ఉన్న విష పదార్థాలన్నీ సమర్థవంతంగా తొలగిపోతాయి. అందువల్ల ఆ నాళంలో వచ్చే ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.
  • హెల్త్ డ్రింక్ గానూ దీన్ని తీసుకోవచ్చు. చాలా మంది క్రీడాకారులు చాలా దూరం పరిగె అలసిపోయిన తర్వాత ఏదో ఒక ఎనర్జీ డ్రింక్‌ని తాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చమటల రూపంలో వారు శరీరం నుంచి చాలా ఎలక్ట్రోలైట్లను కోల్పోతారు. ఇలాంటి వారు ఈ సహజమైన కొబ్బరి బొండం నీళ్లు తాగడం ద్వారా తిరిగి శక్తిని పుంజుకోవచ్చు. తిరిగి రీ హైడ్రేట్‌ కావొచ్చు. ఇది రీఫ్రెష్‌మెంట్‌ని ఇవ్వడంతో పాటు శక్తిని పెంచడానికీ సహకరిస్తుంది.
  • తల్లిపాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ కొబ్బరి బోండాం నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఈ నీళ్లను తాగితే మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది.
  • చాలా మందికి రాత్రిళ్లు మద్యం తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వారు కొబ్బరి నీళ్లను తాగి నిద్రకు ఉపక్రమించడం వల్ల తలనొప్పి, వికారం లాంటివి తగ్గుతాయి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరం ఎలక్ట్రోలైట్లను కోల్పోకుండా ఉంటుంది. ఉదయాన్నే మళ్లీ సాధారణంగా లేచేందుకు ఆస్కారం ఉంటుంది.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *